చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా వెస్టిండిస్‌కు 288 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యం నిర్దేశించింది. ముందుగా టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకోవ‌డంతో భార‌త్ ఆట‌గాళ్లు బ్యాటింగ్‌కు దిగారు. అయితే విండీస్ పేస్ బౌల‌ర్ కార్టెల్ భార‌త్‌ను ఆదిలోనే దెబ్బ‌తీశాడు. 6వ ఓవ‌ర్లో ఓపెనర్ లోకేష్ రాహుల్ 6 ప‌రుగులు, కోహ్లీ 4 ప‌రుగులు చేసి అవుట్ అయ్యారు. ఒకే ఓవ‌ర్లో భార‌త్ రెండు వికెట్లు కోల్పోవడంతో క‌ష్టాల్లో ప‌డింది.

 

ఆ త‌ర్వాత కుదురుగా ఆడుతోన్న రోహిత్ శ‌ర్మ సైతం 36 ప‌రుగులు చేసి 80 ప‌రుగుల వ‌ద్ద అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ 56 బంతుల్లో 36 పరుగులు చేసి జోసెఫ్ బౌలింగ్‌లో పొలార్డ్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. ఆ త‌ర్వాత బ్యాట్స్‌మెన్స్ శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో రాణించారు. పంత్ 49 బంతుల్లో 50 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 70 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 

 

ఆ త‌ర్వాత 114  ప‌రుగులు జోడించాక శ్రేయాస్ అయ్య‌ర్ అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్య‌ర్ 70, రిషిబ్ పంత్ 71 ప‌రుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ త‌ర్వాత కేదార్ జాద‌వ్‌, ర‌వీంద్ర జ‌డేజా స్కోర్ బోర్డ్ ప‌రుగులు పెట్టించారు. కేదార్ జాద‌వ్ 35 బంతుల్లోనే 40 ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు. ర‌వీంద్ర జ‌డేజా 21 ప‌రుగులు చేశాడు. శివ‌మ్ దూబే 8 ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు. చివ‌ర్లో భార‌త్ బ్యాట్స్‌మెన్స్ త‌డ‌బ‌డ‌డంతో భారీ స్కోరు సాధించాల్సిన భార‌త్ 300 లోపు స్కోరుకే ప‌రిమిత‌మైంది. మొత్తం 50 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ 8 వికెట్ల న‌ష్టానికి 287 ప‌రుగులు చేసింది. విండీస్ బౌల‌ర్ల‌లో కార్టెల్‌, కిమో పాల్‌, జోసెఫ్ త‌లా రెండు వికెట్లు తీశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: