నేడు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో వెస్టిండీస్ టీం ఇండియా మొదటి  వన్డే మ్యాచ్ జరుగుతుంది. వరుస సిరీస్ల వేటలో ఉన్న టీమిండియా ఈ  వన్డే సిరీస్ను కూడా గెలుచుకుని వెస్టిండీస్ ను  చిత్తుగా ఓడించాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే టీమిండియా చేతిలో వరుస పరాజయాలు చవి చూస్తున్నా పొలార్డ్ సేనా  కూడా... టీమిండియాను ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలనే దృఢసంకల్పంతో బరిలోకి దిగింది. ఈ క్రమంలో నేడు తొలి వన్డే జరిగింది. అయితే టాస్ గెలిచిన కరేబియన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే కోహ్లీ సేన ను మట్టి కనిపించడానికి సరికొత్త వ్యూహం తో బరిలోకి దిగినట్లు కనిపించింది కరేబియన్ జట్టు. 

 

 

 

 కరేబియన్ బోలర్లు  అందరూ బౌలింగ్తో అదరగొట్టేసారు. ఆదిలోనే కీలక బ్యాట్ మెన్  పెవిలియన్ బాట పట్టించింది కరేబియన్ జట్టు. టీమిండియా స్టార్ ఓపెనర్ కె.ఎల్.రాహుల్ ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ పరుగుల వరద పారిస్తారు  అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ కోహ్లీ నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 36 పరుగులతో పరుగుల వేట ప్రారంభించినప్పటికీ... కరేబియన్ బౌలర్ జోసెఫ్ బౌలింగులో అవుట్ అయిపోయాడు. ఇక టీమిండియా భారీ స్కోరు సాధించలేదు అని  అభిమానులు అనుకుంటున్నా  సమయంలో వచ్చిన శ్రేయస్ అయ్యార్  రిషబ్ పంత్ అదరగొట్టారు. 

 

 

 అద్భుతమైన షాట్లు కొడుతూ పరుగుల వేటలో  దూసుకుపోయారు ఇద్దరు ఆటగాళ్ళు. ఈ క్రమంలోనే 79 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ జోసెఫ్  బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా శ్రేయస్ అయ్యర్ 85 బంతుల్లో ఒక సిక్స్ ఐదు ఫోర్లతో  మొత్తం 79 పరుగులతో రాణించాడు. ఇక ఆ తర్వాత పంత్ ఒక చెత్త షాట్ ఆడి టీమ్ ఇండియా  ఆశలపై నీళ్లు చల్లాడు. అప్పుడు వరకు పంత్  దూకుడుగా ఆడుతూ 69 బంతుల్లో 71 పరుగులు చేసినప్పటికీ.. పొలార్డ్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయిన పంత్ హెట్మేయర్  క్యాచ్ పట్టడంతో ఔట్ అయిపోయాడు . అయితే గతంలో కూడా ఇలాంటి షాట్లు ఆడి కీలక సమయాల్లో  అవుట్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: