మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ఒక హోటల్ ఉద్యోగి కోసం వెతుకుతున్నారు. ఇంకా, అతని అభిమానులను కూడా హోటల్ ఆ ఉద్యోగిను వెతకిపెట్టండంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అస్సలు ఇంతకీ ఆ ఉద్యోగి ఎవరు? అది తెలుసుకోవాలంటే 19 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే.

అప్పట్లో సచిన్ ఒక క్రికెట్ సీజన్ ఆడుతున్నప్పుడు తరచుగా కొన్ని పరుగులకే ఔట్ అయ్యేవారు. అలా ప్రతి మ్యాచ్ లో జరుగుతుండేది. అంతకుముందు వరకు అన్ని మ్యాచ్ లలో ఇరగదీసిన సచిన్ ఒకేసారి ఫామ్ కోల్పోవడంతో.. అభిమానులు ' హఠాత్తుగా సచిన్ కు ఏమైంది' అని అయోమయంలో పడిపోయారు. వాస్తవానికి, సచిన్ కి కూడా తన ఆటలో ఎందుకు మార్పు వచ్చిందో, దానికి సొల్యూషన్ ఏంటో అర్ధం కాలేదు.


ఆ సందర్భంలోనే ఆస్ట్రేలియా తో మ్యాచ్ ఆడేందుకు చెన్నై వచ్చారు సచిన్. మ్యాచ్ ముందు రోజు కోరమాండల్ హోటల్ లో బస చేసారు. ఒక రోజు ఆ హోటలోని హాల్ లో నిల్చొని అతని ఆట తీరు గురించి ఆలోచిస్తున్నారు సచిన్. ఒకానొక సమయంలో యూనిఫామ్ వేసుకొన్న ఒక హోటల్ ఉద్యోగి.. పేరు గురుప్రసాద్.. సచిన్ వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతాడు. తమాషా ఏంటంటే, అతడి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి నోట్ బుక్ కానీ, పేపర్ ముక్క కానీ లేదు. అయితే... తన వద్ద బీట్ బుక్ పై సచిన్ ఆటోగ్రాఫ్ ని స్వీకరిస్తాడు.

https://mobile.twitter.com/sachin_rt/status/1205757235407671296

ఆ తర్వాత, నేనొక విషయం చెబుతాను వింటారా సార్ అంటూ భయపడుతూ అడుగుతాడు. పర్లేదు చెప్పూ అని సచిన్ అంటారు.

దాంతో... గురుప్రసాద్ ఇలా చెప్తాడు, ‘‘మీరు ఎప్పుడైతే ఆర్మ్ గార్డ్ (వేగంగా వచ్చే బాల్ తగిలినా నొప్పి లేవకుండా చేతికి కట్టుకునే గార్డ్) ధరిస్తున్నారో అప్పుడే మీ బ్యాట్ స్వింగ్ మారిపోతున్నది… మీ బ్యాటింగులో తేడా వస్తున్న తీరును గమనించటానికి నేను అనేకసార్లు మీ బ్యాటింగు వీడియోలు రీవైండ్ చేసి చూశాను…’’ అని చెప్పాడు…

ఇది విన్న సచిన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.. ఆ తర్వాత ఆలోచనలో పడి తన రూమ్ కు వెళ్లి ఎల్బో గార్డ్ జాగ్రత్తగా పరిశీలించాడు. ఆపై వాటి వలనే అతని ఆట మారిందని తెలుసుకొని సరైన ప్యాడింగు, తన చేతికి సరిపడా సైజులు కాస్త చేంజ్ చేయించాడు.

19 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేసి  గురుప్రసాద్ ని కలవాలనుకుంటున్న అని తెలియపరిచారు.

రెండు రోజుల తర్వాత ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ గురుప్రసాద్ ను వెతికి పట్టుకుంది. ఆ పై ఇంటర్వ్యూ చేసి సచిన్ కలిస్తే ఏం అడుగుతారు అని ప్రశ్నించినప్పుడు... 'సచిన్ నన్ను కలిసే రోజు నా ఫ్రెండ్స్ ను కూడా నాతో పాటు తీసుకొస్తా. వారిని సచిన్ పలకరిస్తే అదే పది వేలు. అంతకి మించి నాకేమొద్దు' అని చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: