బలహీన బౌలింగ్ వల్లే తొలి వన్డే లో వెస్టిండీస్ చేతిలో భారత్ జట్టు పరాజయాన్ని చవికూడాల్సి వచ్చింది . బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా, బ్యాట్స్ మెన్ల శ్రమ వృధా అయింది . భారత్ బౌలింగ్ విభాగం ఈ మ్యాచ్ లో ఏ దశలోనూ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ల పై ఒత్తిడి పెంచినట్లుగా కన్పించలేదు . వెస్టిండీస్ జట్టు తొలివికెట్ స్వల్ప స్కోర్ వద్దనే కోల్పోయినప్పటికీ , ప్రయోజనం లేకుండా పోయింది . వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లు హోప్,  హెట్మెయర్  అవలీలగా భారత్ బౌలర్లను ఎదుర్కొంటూ , పరుగుల వరద పారించారు .

 

 ఇద్దరు బ్యాట్స్ మెన్లు శతకాలతో చెలరిగిపోయి , వెస్టిండీస్ జట్టును సునాయాసంగా విజయతీరాలకు చేర్చారు . అంతకుముందు భారత్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి ప్రత్యర్థి ముందు గౌరవప్రదమైన స్కోర్ నిర్దేశించింది . భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు విఫలమైనప్పటికీ , యువ ఆటగాళ్లు ఒత్తిడిలోను రాణించారు . శ్రేయాస్ అయ్యర్ , రిషబ్ పంత్ ఆచితూచి ఆడుతూ సమయం చిక్కినప్పుడల్లా షాట్లు కొట్టారు . ఇరువురు అర్ధ సెంచరీలు సాధించి , తాము ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా రాణించగలమని నిరూపించుకున్నారు . శ్రేయాస్ అయ్యర్ , రిషబ్ పంత్ మినహా జాదవ్ ఒక్కడే ఫర్వాలేదనిపించుకున్నాడు .

 

 భారత్ పేస్ బౌలింగ్ విభాగం లో  బుమ్రా , భువనేశ్వర్ కుమార్ , ఉమేష్ యాదవ్, సైనీ లు లేని లోటు స్పష్టంగా కన్పించింది . షమీ , జడేజా లు మాత్రమే  అనుభవజ్ఞుడైన బౌలర్ కావడం , దీపక్ చాహర్ , శివమ్ దూబే ల అనుభవలేమిని వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లు సద్వినియోగం చేసుకున్నారు . షమీ, జడేజా కు కూడా ధారాళంగా పరుగులు ఇవ్వడం తో వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ల పని మరింత సులువయింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: