ఈ సంవత్సరం  చైనా మాస్టర్స్, డెన్మార్క్‌ ఓపెన్, కొరియా ఓపెన్, చైనా ఓపెన్, ప్రపంచ ఛాంపియన్ షిప్ జపాన్‌ ఓపెన్, ఆసియా చాంపియన్‌, సింగపూర్‌ ఓపెన్, ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్, జర్మన్‌ ఓపెన్‌లలోమొమోటా  విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్‌వన్ తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు   , 2019 సీజన్‌ను  ప్రపంచ చాంపియన్‌ కెంటో మొమోటా (జపాన్‌) టైటిల్‌తో ముగించాడు.మొమోటా సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో  విజేతగా నిలిచాడు.  

 

మొమోటా 87 నిమిషాల్లో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ 17–21, 21–17, 21–14తో ఆంథోనీ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించాడు. ఈ ఏడాది  12టోర్నీలలో  ఫైనల్స్‌ చేరగా... 11 టోర్నీల్లో టైటిల్స్‌లో మొమోటా సాధించాడు. తద్వారా బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఒకే ఏడాది అత్యధికంగా 11 టైటిల్స్‌ గెలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు లీ చోంగ్‌ వీ (మలేసియా), వాంగ్‌ జియోలి–యు యాంగ్‌ (చైనా) జంట పేరిట ఉండేది. 2010లో లీ చోంగ్‌ వీ సింగిల్స్‌ విభాగంలో 10 టైటిల్స్‌ నెగ్గగా... 2011లో వాంగ్‌ జియోలి–యు యాంగ్‌ జోడీ మహిళల డబుల్స్‌ విభాగంలో 10 టైటిల్స్‌ సాధించింది.


మొమోటా జిన్‌టింగ్‌తో జరిగిన ఫైనల్లో  అద్భుతమే చేశాడు. ఈ జపాన్‌ స్టార్‌ తొలి గేమ్‌ కోల్పోయిన  రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. ఒకదశలో 5–12తో నిర్ణాయక మూడో గేమ్‌లో  ఏడు పాయింట్లతో వెనుకబడి ఉన్నాడు. అయితే ఈ టోర్నీకంటే ముందు తాను ఆడిన నాలుగు టోర్నీల ఫైనల్స్‌లోనూ ఓడిపోయిన జిన్‌టింగ్‌ కీలకదశలో ఒత్తిడికి లోనయ్యాడు. 12–12తో వరుసగా ఏడు పాయింట్లు గెలిచి మొమోటా స్కోరును సమం చేశాడు. 

 

ఒక్కసారిగా చెలరేగి ఆ తర్వాత స్కోరు 15–14 వద్ద మొమోటా  వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకున్నాడు.  దాంతో ఈ ఏడాది జిన్‌టింగ్‌ టోర్నీ లో  ఆడిన ఐదు  ఫైనల్స్‌లో ఓటమిని మూటగట్టుకున్నాడు. చాంపియన్‌ మొమోటాకు లక్షా 20 వేల డాలర్లు (రూ. 84 లక్షల 83 వేలు), రన్నరప్‌ జిన్‌టింగ్‌కు 60 వేల డాలర్లు (రూ. 42 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: