మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్‌కు కోలుకోని ఎదురు దెబ్బ తగిలింది. అదేమంటే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్ బౌలర్ షెల్డాన్‌ కాట్రెల్‌.. ఆదిలోనే కీలక బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చి టీమిండియాను భారీ దెబ్బ కొట్టాడు. ఇకపోతే టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ కీరన్‌ పొలార్డ్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

 

 

ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం​ చేసిన యువ ఆల్‌ రౌండర్‌ శివం దూబే.. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో దూబే ఆకట్టు కోవడంతో వన్డేల్లో ఎంపికకు మార్గం సుగమం అయ్యింది. ఇక మయాంక్‌ అగర్వాల్‌కు అవకాశం ఇవ్వని మేనేజ్‌మెంట్‌ కేఎల్‌ రాహుల్‌ను జట్టులోకి తీసుకుంది. ఇదిలా ఉండగా  భారత్-వెస్టిండీస్ మధ్య చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మొదటి వన్డేలో విండీస్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్మయిర్ చెలరేగాడు. హెట్మయిర్ కేవలం 85 బంతుల్లో 4 సిక్స్‌లు, 8 ఫోర్లతో సెంచరీ చేసాడు.

 

 

వన్డేల్లో హెట్మయిర్‌కు ఇది ఐదవ సెంచరీ కాగా.. టీమిండియా పై రెండో సెంచరీ. హెట్మయిర్ సెంచరీకి తోడు షై హోప్ (105 బంతుల్లో 58: 4 ఫోర్లు) కూడా హాఫ్ సెంచరీ చేయడంతో.. విండీస్ జట్టు విజయం సాధించింది. ఇకపోతే టీమిండియాతో మొదటి వన్డేలో హెట్‌మెయిర్‌ సెంచరీతో మెరిశాడు. ఇది హెట్‌మెయిర్‌కు వన్డేల్లో ఐదో సెంచరీ కాగా, 38వ ఇన్నింగ్స్‌. దాంతో ఒక అరుదైన రికార్డును హెట్‌మెయిర్‌ తన పేరిట లిఖించుకున్నాడు.

 

 

ఇప్పటివరకు షాయ్‌ హోప్‌(46 ఇన్నింగ్స్‌లు), గ్రీనిడ్జ్‌(52 ఇన్నింగ్స్‌లు), రిచర్డ్స్‌(54 ఇన్నింగ్స్‌లు), క్రిస్‌ గేల్‌ (66 ఇన్నింగ్స్‌లు), డేస్మండ్‌ హేన్స్‌(69 ఇన్నింగ్స్‌లు), బ్రియాన్‌ లారా(83 ఇన్నింగ్స్‌లు)లు  వరుసగా ఉండగా వీరందర్ని వెనక్కి నెట్టి వెస్టిండీస్‌ తరఫున తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఐదు వన్డే సెంచరీల మార్కును చేరిన వారిలో హెట్‌ మెయిర్‌ టాప్‌ ప్లేస్‌కు వచ్చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: