ప్రఖ్యాత ఇంగ్లాండ్ బ్యాట్స్ మ్యాన్ బెన్ స్టోక్స్ కు ఒక అరుదైన గౌరవం దక్కింది. జట్టులోకి ప్రవేశించిన తరువాత చాలావరకు తన ఆకట్టుకునే ఆట తీరుతో ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించినాస్టోక్స్, మధ్యలో కొన్ని కీలక మ్యాచ్ లను కూడా గెలిపించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ మరియు యాషెస్ సిరీస్ లను ఇంగ్లాండ్ జట్టు కైవశం చేసుకోవడంలో స్టోక్స్ ముఖ్య పాత్ర పోషించాడు. 

 

ఇకపోతే ఆ రెండు సిరీస్ ల తో పాటు మరికొన్ని మ్యాచుల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచినందుకు గాను స్టోక్స్  'బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు ఇటీవల ఎంపిక చేయడం జరిగింది. అతడి తరువాత బిబిసి వారు రెండవ స్థానాన్ని ఫార్ములావన్ ప్రపంచ ఛాంపియన్‌ హామిల్టన్‌ కు కేటాయించడం జరిగింది. నేడు ఇంతటి అత్యద్భుత అవార్డును గెలుచుకున్నందకు గాను స్టోక్స్ మాట్లాడుతూ, తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానని, అయితే ఒక క్రీడాకారుడిగా ఇంగ్లాండ్ దేశం తరపున ఆడుతున్న తనకు, జట్టులోని సభ్యులందరూ కూడా ఎంతో సహకారం అందించారని అన్నారు. 

 

నిజానికి ఇటువంటి గొప్ప పురస్కారాన్ని అందుకోవడానికి జట్టు సభ్యులు అందరూ కూడా హాజరైతే బాగుండేదని, కానీ తాను వ్యక్తిగతంగా వచ్చి ఈ అవార్డు ను అందుకోవలసి వచ్చిందని స్టోక్స్ అన్నాడు. ఇక ప్రతి ఒక మ్యాచ్ ని తాను ఎంతో స్ఫూర్తిగా తీసుకుని ఆడతానని, ఇక పై భవిష్యత్తులో కూడా రాబోయే మ్యాచ్ ల లో తనవంతుగా ఆడి దేశానికి సేవ చేస్తానని స్టోక్స్ అన్నాడు. తమ జట్టు సభ్యుడికి ఇంతటి అత్యున్నత పురస్కారం లభించడంతో ఇంగ్లాండ్ జట్టు సభ్యులు మరియు బోర్డు అధికారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ అతడికి అభినందనలు తెలియచేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: