చెన్నైలోని చేపాక్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య నిన్న జరిగిన మొదటి వన్డే మ్యాచ్  రసవత్తరంగా సాగింది. వెస్టిండీస్ బౌలర్లు  టీమ్ ఇండియా బ్యాట్ మేన్స్  పై విరుచుకుపడ్డారు. దీంతో టీమిండియా బ్యాట్స్మెన్ అందరు  ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు చేరిపోయారు. ఆటగాళ్లు సైతం భారీ స్కోర్లు నమోదు చేయకుండా బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ అద్భుత షాట్లతో  నుంచి భారీ స్కోర్ వైపుగా తీసుకెళ్లి నప్పటికీ వాళ్లు కూడా ఒకానొక దశలో నిరాశపరిచారు. ఇక  సరికొత్త వ్యూహం తో బరిలోకి దిగిన వెస్టిండీస్ భారత్ బ్యాట్ మేన్స్  అందరినీ ఇబ్బంది పెడుతూ పెవిలియన్  పంపించడంలో విజయం సాధించదు. వెస్టిండీస్ బౌలర్ల కొత్తవ్యూహం  పని చేసినట్లయింది . 

 

 

 వెస్టిండీస్తో జరిగిన టి20 మ్యాచ్ లో భారత్ ర2-1 తేడాతో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం 1-0 తో కరీబియన్ జట్టు ముందంజలో ఉంది. రాబోయే రెండు మ్యాచుల్లో కరేబియన్ జట్టు ఒక మ్యాచ్ గెలిస్తే చాలు సిరీస్ను కైవసం చేసుకోవచ్చు...కాని ఇండియా  మాత్రం తప్పనిసరిగా రెండు మ్యాచుల్లో  విజయం సాధించాల్సిందే. మొదట కరేబియన్ బౌలర్ల ధాటికి ఇండియన్ స్టార్ బ్యాట్ మెన్స్ అందరూ పేలవ ప్రదర్శన చేయగా ఆ తర్వాత.. బౌలర్లు కూడా సరిగ్గా కరేబియన్ బ్యాట్మేన్స్ ను  కంట్రోల్  చేయకపోవడంతో... వెస్టిండీస్ బ్యాట్స్మెన్ అందరు  చెలరేగిపోయారు. సిక్సులు  ఫోర్లతో హోరెత్తించారు. 

 

 

 

చివరికి మొదటి వన్డేలో విజయం సాధించింది వెస్టిండీస్ జట్టు. వెస్టిండీస్ వన్డే మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ వెస్టిండీస్ జట్టుకు మాత్రం భారీ షాక్ తగిలింది.స్లో  ఓవర్ రేట్ కారణంగా వెస్టిండీస్ జట్టుకు షాక్ ఇచ్చింది ఐసీసీ. ఐసిసి నిబంధనల ప్రకారం వెస్టిండీస్ జట్టు వేయాల్సిన ఓవర్ ల కంటే  నాలుగు ఓవర్లను తక్కువగా వేసింది.దీంతో  ఒక్కొక్క ఆటగానికి  20 శాతం చొప్పున  80% చొప్పున సపోర్టు ప్యానల్ కు  ఐసీసీ ఫీజు కోత విధించింది.అంతేకాకుండా ఈ తప్పిదాన్ని వెస్టిండీస్ టీం కెప్టెన్ పొలార్డ్ సైతం అంగీకరించడం గమనార్హం. కాగా ఇండియా వెస్టిండీస్ మధ్య రెండో వన్డే ఈ నెల 18న విశాఖలో జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: