అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మట్ లలో   ప్రస్తుతం కేవలం ఇద్దరే ఇద్దరు ఆటగాళ్లు ఐసీసీ బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో టాప్ 10  లో కొనసాగుతున్నారు. అందులో  మొదటి వాడు టీమిండియా  సారథి కింగ్ కోహ్లి. టెస్టు , వన్డే ,టీ20 ఇలా ఫార్మాట్ ఏదైనా  తనదైన ఆట తీరుతో టాప్ 10లో  కొనసాగుతున్నాడు కోహ్లి.  అందులో భాగంగా  కోహ్లి ,టెస్టుల్లో , వన్డే ల్లో  నెంబర్ 1 ర్యాంక్ లో కొనసాగుతుండగా టీ 20ల్లో  ప్రస్తుతం 10వ ర్యాంక్ లో వున్నాడు. 
 
ఇక కోహ్లితో పాటు పాకిస్థాన్  స్టార్ క్రికెటర్  బాబర్ ఆజమ్ కూడా  ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. బాబర్  టీ20ల్లో మొదటి ర్యాంక్ లో వన్డే ల్లో 3 ర్యాంక్ లో  కొనసాగుతుండగా  ఐసీసీ తాజాగా విడుదలచేసిన  టెస్టు ర్యాంకింగ్స్ లో మొదటి సారి టాప్ 10లో చోటు దక్కించుకొని ప్రస్తుతం  9వ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.  ఇక ఇదిలా ఉంటే  గతంలో  పాక్ క్రికెట్ అభిమానులు , మాజీ క్రికెటర్లు  బాబర్ ను  కోహ్లి తో పోల్చిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: