వరుస సిరీస్ లతో దూసుకుపోతు అదరగొడుతుంది భారత జట్టు... ఎలాగైనా విజయాన్ని సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది వెస్టిండీస్ జట్టు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా చేతిలో 2-1 తేడాతో వెస్టిండీస్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం టీమ్ ఇండియా వెస్టిండీస్ మధ్య వన్డే మ్యాచ్ జరుగుతుంది. అయితే చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో వెస్టిండీస్ జట్టు భారత జట్టు కు షాక్ ఇచ్చినదనే   చెప్పాలి. వెస్టిండీస్ బౌలర్ల ధాటికి భారత టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయి పెవిలియన్ బాట పట్టేసారు . అయినప్పటికీ 288 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా. ఇక ఆ తర్వాత భారత  బౌలర్లు కరేబియన్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. భారత బౌలర్లు అందరూ పేలవ  ప్రదర్శన చేయడంతో కరేబియన్ బ్యాట్స్మెన్ అందరూ చెలరేగిపోయి ఆడారు. 

 

 

 

 దీంతో సునాయాసంగా వెస్టిండీస్ జట్టు మొదటి వన్డేలో విజయం సాధించి భారత జట్టుకు  షాక్ తగిలినట్లయింది. కాగా నేడు విశాఖలో భారత్ వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరగపోతుంది. సిరీస్ గెలవాలి అంటే భారత జట్టు ఐదు వన్డే లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రెండు మ్యాచ్ల్లో వరుసగా గెలిస్తేనే టీమిండియా సిరీస్ గెలవడానికి అవకాశం ఉంది. గత ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో 3 వన్డే సిరీస్ లను  కోల్పోయింది టీమిండియా. ఇప్పుడు వెస్టిండీస్ కి ఆ అవకాశం ఇవ్వద్దని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా  ఇప్పటికే ఇరు జట్ల మధ్య రెండో వన్డే కి రంగం సిద్ధమైపోయింది. 

 

 

 

 భారత్ కు బాగా కలిసొచ్చిన వేదికల్లో వైజాగ్ కూడా ఒకటి... కాకపోతే ఇక్కడ భారత్ కు ఎదురైన ఒకే ఒక పరిచయం వెస్టిండీస్ జట్టుతో కావడం కూడా గమనార్హం. భారత జట్టు సొంతగడ్డపై ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వరుసగా రెండు వన్డే సిరీస్ సిరీస్లో ఓడిపోయింది. కాగా  విశాఖలో జరగబోయే మ్యాచ్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేసి విజయాన్ని సొంతం చేసుకోకపోతే మాత్రం రెండు చెత్త రికార్డులు ఖాతాలో చేరిపోతాయి. అయితే భారత స్టార్ బ్యాట్ మెన్స్  అయినా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లకు  గతంలో విశాఖ స్టేడియం లో చెలరేగిన రికార్డులు ఉన్నాయి. కాగా అటు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ కూడా విశాఖ స్టేడియం లో అద్భుత ప్రదర్శన కూడా తీస్తారు. బ్యాటింగ్  కి అనుకూలమైన పిచ్  గా ఉన్న విశాఖ స్టేడియం లో ఎవరు అద్భుత ప్రదర్శన చేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: