ఒకప్పటి టీమిండియా స్టార్.. బరిలోకి దిగితే బౌలర్లకు ముచ్చెమటలు పట్టించే వాడు... ఏకంగా ఆరు బాల్లకు ఆరు సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు.. అతనె  టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్. ఓవైపు బ్యాటింగ్ తో   మరోవైపు అప్పుడప్పుడు బౌలింగ్లోనూ తన సత్తా చాటుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడు యువరాజ్ సింగ్ . ఇక ఒక్కసారి బాటిల్ పట్టుకొని మైదానంలోకి దిగాడు అంటే బౌలర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. పరుగుల వరద పారాల్సిందే . టీమిండియాలో అద్భుత ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్న యువరాజ్ సింగ్ కు  సడన్గా మాయదారి క్యాన్సర్ వ్యాధితో కొన్ని రోజుల వరకు టీమిండియాకు దూరమయ్యాడు. అయినప్పటికీ క్యాన్సర్ వ్యాధిని జయించి మళ్లీ మళ్లీ తెర మీదికి వచ్చినప్పటికీ తన స్థాయి ప్రదర్శన చేయకపోవడంతో అవకాశాలు తగ్గాయి చివరికి మనస్తాపంతో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు యువరాజ్ సింగ్. 

 

 

 

 అయితే తాజాగా టీమిండియా యాజమాన్యం పై సంచలన వ్యాఖ్యలు చేసాడు యువరాజ్యం. 2019 వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా విజయపు అంచుల వరకూ వెళ్లి  వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా ఓటమి పాలు ఇవ్వడానికి టీమ్ ఇండియా యాజమాన్యం అవలంబించిన తీరే కారణమంటూ యువరాజ్ సింగ్ తప్పు పట్టాడు. ప్రపంచ కప్లో మిడిలార్డర్లో అనుభవం లేని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడమే టీమిండియా జట్టు ప్రపంచ కప్ లో ఓడిపోవడానికి కారణం అయిందని యువరాజ్ వ్యాఖ్యానించారు. నిన్న మీడియాతో మాట్లాడిన యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

 

 

 ప్రపంచ కప్ లో టీమిండియా టాప్ ఆర్డర్ బాగున్నప్పటికీ టాప్ ఆర్డర్ కు అనుగుణంగా మిడిలార్డర్లో సరైన ఆటగాళ్లను టీమిండియా యాజమాన్యం ఎంపిక చేయలేకపోయిందని.. యువరాజ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంబటి రాయుడు విషయంలో కూడా యాజమాన్యం విధానంపై  అసంతృప్తి వ్యక్తం చేశాడు. రిషబ్ పంత్ విజయ శంకర్ లాంటి అనుభవం లేని ఆటగాళ్లు ప్రపంచ కప్ కు ఎంపిక చేయడం ఏంటని టీమిండియా యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. అలా అని యువ ఆటగాళ్ల ఆట తీరును తప్పు పట్టడం లేదని వారికి కేవలం ఐదు వండేలు  మాత్రమే ఆడిన అనుభవం ఉందని తెలిపాడు. జుట్టు విషయంలో యాజమాన్యం సరైన ప్రణాళిక అవలభించకపోవడంతో నే ప్రపంచ కప్ లో విజయం సాధించలేక పోయిందని విమర్శించారు యువరాజ్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: