టీమిండియా  సారథి , కింగ్ కోహ్లికి  స్వదేశంలో అన్ని మైదానాల్లో కెల్లా అచొచ్చిన మైదానం  ఏదంటే  దానికి  వచ్చే మొదటి సమాధానం  వైజాగ్ లోని  ఏడిఏ  -విసిడిఏ స్టేడియం.  ఈమైదానం లో    చివరి  5మ్యాచ్ ల్లో  కోహ్లి చేసిన పరుగులు 556పరుగులు. ఇందులో మూడు  సెంచరీలు , రెండు హాఫ్  సెంచరీలు  వున్నాయి.  కోహ్లి బ్యాటింగ్ యావరేజ్ 139.  ఇప్పుడు ఈ ఘణాంకాలు  చూసి పర్యాటక జట్టు  వెస్టిండీస్ శిబిరం లో ఆందోళన మొదలైంది.
 
మూడు  మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా  నేడు  వైజాగ్ లో  భారత్ -వెస్టిండీస్  లమధ్య  రెండో వన్డే జరగనుంది. డు ఆర్ డై మ్యాచ్ కావడంతో  ఒత్తిడంతా  టీమిండియా మీదనే వుంది అలానీ విండీస్  కూడా  తేలికగా తీసుకోవట్లేదు.  వైజాగ్ లో విరాట్ ఫామ్ ను చూసి  విండీస్  కంగారు పడుతుంది.  సాధ్యమైనంత వరకు కోహ్లిని త్వరగా అవుట్ చేస్తేనే  మ్యాచ్  వారి  చేతుల్లోకి వెళుతుంది లేదంటే  ఆశలు వదిలేసుకోవాల్సిందే. దాంతో  కోహ్లిని అవుట్ చేయడం పైనే ఆజట్టు ప్రధానంగా దృష్టిపెట్టింది.   ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా  బ్యాటింగ్ విభాగంలో  మార్పులు లేమి చేయకున్నా బౌలింగ్ లో మాత్రం ఒకటి రెండు మార్పులు చేయనున్నట్లు సమాచారం.  అందులో భాగంగా  చాహల్ తోపాటు  ఎక్స్ట్రా పేసర్ అవసరం అనుకుంటే  శ్రద్ధుల్ ఠాకూర్  తుది జట్టులో స్థానం దక్కించుకోనున్నాడు. ఒక వేళా వీరి  బెర్తులు ఖరారు అయితే  శివమ్ దూబే ,జడేజా బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: