ఒక సమయంలో ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే ప్రపంచ క్రికెటర్లకు సచిన్ టెండూల్కర్. కానీ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచానికి ఇండియా టీమ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు విరాట్ కోహ్లీ. గత కొన్ని సంవత్సరాల నుండి భారత జట్టుకు సంబంధించి మూడు ఫార్మాట్లలో అద్భుతమైన పరుగులు మరియు భారత జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రపంచ బ్యాట్స్మెన్లలో మొదటి స్థానం కైవసం చేసుకుంటూ అనేక రికార్డులు పరుగులు మరియు సెంచరీలు హాఫ్ సెంచరీలు  అతి తక్కువ కాలంలోనే నమోదు చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా బుధవారం నాడు విశాఖ వేదికగా జరగనున్న రెండో వన్డే కు అరుదైన కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

 

ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే మూడు ఫార్మాట్లలో కలిపి భారత్ తరుపున 400 మ్యాచ్‌లు ఆడిన ఎనిమిదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో విశాఖపట్టణం వేదిక జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ 400  మ్యాచ్ ఆడటంతో భారత క్రికెటర్లు తరుపున ఎనిమిదోవ ఆటగాడిగా కొత్త రికార్డు ఘనతను సాధించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఇప్పటి వరకు 399 మ్యాచ్‌లు ఆడాడు.

 

ఇందులో 84 టెస్టులు, 240 వన్డేలు, 75 టీ20లు ఉన్నాయి. కాగా, 400 మ్యాచ్‌లు అంతకంటే ఎక్కువ ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో ధోని, రాహుల్ ద్రవిడ్, అజహరుద్దీన్, గంగూలీ, కుంబ్లే, యువరాజ్ సింగ్‌లు ఉండగా తాజాగా లిస్టులోకి ఎనిమిదవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఈ అరుదైన ఘనతను సాధించాడు. మూడు మ్యాచ్ లా ఈ సిరీస్ లో ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని వెస్టిండీస్ ఉండగా మరోపక్క భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్లో ఉండే ప్రయత్నం చేపట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: