గత ఆదివారం నాడు చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో  జరిగిన తొలి వన్డేలో టీమిండియా  ఒడి పోవడం జరిగిన సంగతి అందరికి తెలిసిందేకదా. నేడు (బుధవారం) విశాఖపట్నం వేదికగా మధ్యాహ్నం నుంచి రెండో వన్డే మ్యాచ్ ప్రారంభం అవ్వగా.. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం చేయాలని భారత్ జట్టు భావనలో ఉంది. ఇది ఇలా ఉండగా మరోవైపు చెపాక్ స్టేడియం రికార్డ్‌ సాధించిన 288 పరుగుల లక్ష్యాన్ని ఎదురుకున్న కరీబియన్లు రెండో వన్డేలో కూడా  గెలిచి సిరీస్‌ని సొంతం చేసుకోవాలని ఉంది. ఈ రెండు జట్టులు పోటా పోటీగా ఉండడంతో దీంతో.. మ్యాచ్ ఆసక్తికరంగా ఉండబోతుంది.

Image result for నేడు  విశాఖపట్నం వేదికగా రెండో వన్డే..


ఇక తొలి వన్డే టెస్ట్లో భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ విజయం కైవసం చేసుకోలేకపోయిన.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌లు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో మంచి స్కోర్ తీయడం జరిగింది.  దీంతో.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 287 పరుగుల వద్ద ఆగిపోయింది. ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా బౌలింగ్ పరంగా సరిగ్గా చేయలేకపోయాడు. దీంతో.. వైజాగ్ వన్డేలో భారత్ జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశలు కూడా ఉన్నాయి. ఇందు కోసం శివమ్ దూబే స్థానంలో ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.

 


ఇక వైజాగ్ స్టేడియం రికార్డులు చూసుకుంటే..? భారత్ జట్టు అక్కడ 9 వన్డేలాడి ఏకంగా 6 విజయాలు సొంతం చేసుకుంది. మిగిలిన మూడింట్లో ఒకటి టై అవగా, మరొకటి రద్దు అవ్వడం జరిగింది. మిగితా  ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోవడం జరిగింది. అది కూడా వెస్టిండీస్ చేతిలోనే కావడం గమనించవలసిన విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: