విశాఖపట్నంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం లో నేడు వెస్టిండీస్ ఇండియా మధ్య  రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మొదటి  వన్డే మ్యాచ్లో గెలిచి ఆధిక్యంలో ఉన్న కరేబియన్ జట్టు... మరో మ్యాచ్ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని దృఢ సంకల్పంతో ఉంది. మరోవైపు టీమిండియా జట్టు కూడా రెండో వన్డే మ్యాచ్ విజయం సాధించి సిరీస్ పై ఆశలు సజీవం చేసుకునేందుకు పట్టుదలతో మైదానంలోకి దిగింది. ఈ నేపథ్యంలో అటు అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది.కాగా టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ మొదట బ్యాటింగ్ దిగింది. అయితే బ్యాటింగ్  మైదానంలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు కరేబియన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కరేబియన్ బౌలర్లు  వేసిన బంతిని భూమి మీద కాకుండా మొత్తంగా గాల్లోనే ఉంచేసారు అని చెప్పాలి. 

 

 

 

 ఏకంగా టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్స్  రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు చెరో  శతకంతో అద్భుత బ్యాటింగ్ చేసి టీమిండియాకు భారీ స్కోర్ చేసి పెట్టారు. ఇక మిగితా ప్లేయర్లు కూడా అదే ఆట ను కొనసాగిస్తూ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కాగా  కరేబియన్ జట్టుకు భారీ టార్గెట్ ను భారత జట్టు ఉంచింది . ఇదిలా ఉంటే టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం మొదటి బాల్  డకౌట్ అయ్యి  పెవిలియన్ బాట పట్టడం గమనార్హం. విరాట్ కోహ్లీ ఒకటే బాల్ కి అవుట్ అయి విలియం బాట పట్టడంతో టీమిండియా అభిమానులు అందరూ కాస్త నిరాశ చెందారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒకవేళ చెలరేగి  ఉంటే భారత్ స్కోరు మరింత పెరిగేదని  అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

 

 

 

 ఇదిలా ఉండగా రెండవ వన్డేలో  సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. అయితే ఇక్కడో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.అదీ   ఏమిటంటే .. వెస్టిండీస్ జట్టు కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ అయిన పోలార్డ్  మొదటి బంతికే డకౌట్ అయి పెవిలియన్  బాట పట్టాడు. ఓవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోవైపు వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ మొదటి బంతికే డకౌట్ అయి చెత్త రికార్డు నెలకొల్పారు. పోలార్డ్ బౌలింగ్ లో  ఛేజ్ కి  క్యాచ్ ఇచ్చి కోహ్లీ మొదటి బాల్ కి  గోల్డెన్ డకౌట్ అయ్యి  వెనుదిరగగా... షమీ బౌలింగ్లో పంత్ కి  క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు వెస్ట్ ఇండీస్ కెప్టెన్ పోలార్డ్ . దీంతో ఇద్దరికి కెప్టెన్ల ఖాతాలో ఓ చెత్త రికార్డ్ వచ్చిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మొదటి వన్డే మ్యాచ్లో కూడా 8 పరుగులకే ఔట్ అయి అభిమానులందరినీ నిరాశపరిచిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: