2019 క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదాన్నే పంచింది. ఇక కొన్ని దేశాలకు విషాదాన్ని కూడా నింపింది... ఈ ఏడాది యాషెస్, క్రికెట్ ప్రపంచకప్ అభిమానులకు మంచి వినోదాన్ని పంచాయి... ఇక కొన్ని వివాదాలు కూడా క్రికెట్ ని వెంటాడాయి అనే చెప్పాలి... ఈ ఏడాది క్రికెట్ హైలెట్స్ ఒకసారి చూస్తే...

 

- ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కుశాల్ పెరరా ఆడిన ఇన్నింగ్స్ శ్రీలంక క్రికెట్ చరిత్రలో నిలిచింది... ఆ మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన పెరరా... జట్టుకి ఓటమి తప్పదు అని భావించిన తరుణంలో... చేసిన 153 పరుగులు జట్టుకి విజయాన్ని అందించారు. ఆఖరి వికెట్ కి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఒంటి చేత్తో కుశాల్ పెరారా మ్యాచ్ ని గెలిపించాడు. సఫారి పేస్ ఎటాక్ ని దీటుగా ఎదుర్కొని నిలబడ్డాడు.

 

- ప్రపంచ కప్ విషయానికి వస్తే... ఈ మెగా టోర్నీలో ప్రతీ ఒక్కటి సంచలనంగానే నిలిచింది... టీం ఇండియా తరుపున రోహిత్ శర్మ ప్రపంచకప్ చరిత్రలో 5 సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

 

- సెమి ఫైనల్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన... మ్యాచ్ లో కీలక సమయంలో ధోని రనౌట్ అవడం ప్రపంచకప్ లో భారత్ తిరుగు ముఖం పట్టడానికి కారణంగా మారింది... ధోని రనౌట్ అవకుండా ఉండి ఉంటే టీం ఇండియా ఫైనల్ కి వెళ్ళేది...

 

- ఇక ఈ టోర్నీలో... ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే వివాదాస్పద మ్యాచ్ గా నిలిచింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో... గుప్తిల్ విసిరినా త్రో... బెన్ స్తోక్స్ బ్యాట్ కి తగిలి ఓవర్ త్రో గా మారడం, మ్యాచ్ తర్వాత డ్రా గా ముగియడం, మళ్ళీ సూపర్ ఓవర్ కూడా డ్రా అవడంతో... సిక్సులు ఫోర్ల ఆధారంగా... విజేతను ప్రకటించారు... దీని నుంచి ఇప్పటి వరకు కివీస్ ఆటగాళ్ళు బయటకు రాలేదు.

 

- ప్రతిష్టాత్మక యాషెస్ సీరీస్ సందర్భంగా... జట్టులోకి పునరాగమనం చేసిన... ఆసిస్ కీలక ఆటగాడు... స్టీవ్ స్మిత్... 1200 పరుగులకు పైగా చేసి... సరికొత్త రికార్డులు నమోదు చేసాడు.

 

- ఇక అదే యాషెస్ సీరీస్ లో... ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్తోక్స్ చేసిన 135 పరుగులు చరిత్రలో నిలిచిపోతాయి... జట్టు ఓటమి ఖాయం అనుకున్న తరుణంలో... స్తోక్స్ చేసిన 135 పరుగులతో ఇంగ్లాండ్ జట్టు ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది.

 

- బంగ్లాదేశ్ కీలక ఆటగాడు... షకిబుల్ హసన్... ఫిక్సింగ్ లో తేలడంతో రెండేళ్ళు సస్పెన్షన్ విధించారు.

 

- టీం ఇండియా లెఫ్ట్ హ్యాండర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఈ ఏడాది తప్పుకున్నాడు.

 

- పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్... తన కెరీర్ లో తొలి ట్రిపుల్ సెంచరి నమోదు చేసాడు.

 

- ఈ ఏడాది బంగ్లాదేశ్ తో కోల్కతా వేదికగా... టీం ఇండియా తన తొలి డే అండ్ టెస్ట్ ఆడింది.

 

- బీసీసీఐ చీఫ్ గా గంగూలీ నియామకం జరిగింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రెండో ఆటగాడిగా గంగూలీ నిలిచాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: