వేలంలో మొట్టమొదటి ఆటగాడైన ఆసీస్ ఓపెనర్ క్రిస్ లిన్ ను ముంబై ఇండియన్స్ రెండు కోట్ల కనీస ధరకు కొనుగోలు చేయగా ఇంగ్లాండ్ కు మొట్టమొదటిసారి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ను షారుక్ ఖాన్ యొక్క కోల్ కతా నైట్ రైడర్స్ ఐదున్నర కోట్లకు కొనుగోలు చేసింది. ఇకపోతే టీం ఇండియా స్టార్ ఓపెనర్ రాబిన్ ఊతప్ప ను రాజస్థాన్ రాయల్స్ మూడు కోట్లకు సొంతం చేసుకోగా ఆశ్చర్యకరంగా ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటిన్నర కోటికే పొందింది. ..

 

ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్... విరాట్ కోహ్లీ నేతృత్వం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగు కోట్ల నలభై లక్షలకు కొనుగోలు చేయగా ఆస్ట్రేలియా కరమైన మిడిలార్డర్ బ్యాట్స్ నన్ మాక్స్వెల్ కోసం పంజాబ్ మరియు ఢిల్లీ చివరి వరకు పోరాడాఅయి. చివరికి ఏ జట్టు అయితే ఇంతకుముందు మ్యాక్స్వెల్ ను ఢిల్లీకి వదులుకుందో... అదే పంజాబ్ 10 కోట్ల 75 లక్షల రూపాయలకు ఇప్పుడు అతని సొంతం చేసుకుంది.

 

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ ఢిల్లీకి కోటి యాభై లక్షల కే అమ్ముడు పోగా భారత మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ యూసఫ్ పఠాన్ పైన ఎవరూ ఆసక్తి చూపలేదు. అతడు క్రితం సారి ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడాడు. ఇకపోతే ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ను రికార్డు స్థాయిలో 15 కోట్ల యాభై లక్షలకు కోల్ కత్ నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. అతను ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా రికార్డు సాధించాడు.  

 

ఇతని కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తుది వరకు పోరాడగా సరిగ్గా 14 కోట్లు వద్ద కోల్ కతా నైట్ రైడర్స్ రంగంలోకి దిగి కమిన్స్ ను ఎగరేసుకుని పోయారు. 16 కోట్లకు అమ్ముడుపోయిన యువరాజ్ సింగ్ ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ మొత్తం పొందిన ఆటగాడిగా మొదటి స్థానంలో ఉండగా కేవలం 50 లక్షల తక్కువతో ప్యాకెట్ కమింగ్ రెండో స్థానంలో నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: