ఒకపక్క ఆటగాళ్ళు మైదానం లో ఎలా అయితే ఎన్నో స్ట్రేటజీల తో ప్రత్యర్థుల్ని కకావికలు చేస్తారో అంతకన్నా ఎక్కువగానే మైండ్ గేమ్ ఫ్రాంచైజీ ఓనర్లు మరియు సహాయక బృందం వేలం సమయంలో చూపించాల్సి ఉంటుంది. అయితే విచిత్రంగా ప్రతీసారి తెలివిగా ఆలోచించి ఆటగాళ్లను కొనుగోలు చేస్తారు అని పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ వేలంలో కొంచెం తడబడినట్లు కనపడగా పంజాబ్ మరియు ఢిల్లీ జట్టు మాత్రం అదరగొట్టేశాయి అనే చెప్పాలి.

 

పంజాబ్ నూతన హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ను చాలా తెలివిగా బోల్తా కొట్టిద్దాం అనుకున్న చెన్నై టీం చివరికి వారు తవ్వుకున్న గోతిలో వారే పడ్డారు పడ్డారు. ఇండియన్ వెటరన్ లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా పేరు దాదాపు అందరూ మర్చిపోయారు. అయితే ఊహించని రీతిలో ఆక్షన్ లో పంజాబ్ మరియు చెన్నై జట్లు అతని కోసం విపరీతంగా పోటీపడ్డాయి. పంజాబ్ కి మంచి లెగ్ స్పిన్నర్ లేడు కానీ చెన్నైకు తాహిర్ మరియు శర్మ ఉన్నప్పటికీ 6.75 కోట్ల వద్ద పంజాబ్ పోటీ నుంచి తప్పుకోవడంతో చెన్నై బృందం మొహం మాడిపోయింది. ఇంగ్లాండ్ యువ ఆల్రౌండర్ శ్యామ్ కుర్రన్ మరియు ఆస్ట్రేలియా పేసర్ హెజిల్ వుడ్ ను సొంతం చేసుకునా అందరూ వారి స్థాయి కన్నా చాలా ఎక్కువ మొత్తమే పెట్టారు అంటున్నారు. దానికి తప్ప అంతకు మించి చెన్నై వారు ఇప్పటివరకు వేలంలో చేసింది ఏమీ లేదు.

 

ఇక సన్ రైజర్స్ అయితే అసలు పేరు కూడా తెలియని ఆటగాళ్లను జట్టులోకి తీసుకోగా ఇంగ్లాండ్ ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన జేమ్స్ నీషమ్ ను వదిలేసి కనుమరుగైపోయిన ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కోసం 2 కోట్లు వెచ్చించారు.

 

మరొకవైపు పంజాబ్ 50 కోట్లకు నీషమ్ ను సొంతం చేసుకోగా కేవలం ఒకటిన్నర కోటి కే ఢిల్లీ జట్టు జేసన్ రాయ్ ను ఎగరేసుకుపోయింది. విండీస్ ఆటగాళ్లు అయిన హెట్ మేయర్ ను 7.75 కోట్లకి ఢిల్లీ సొంతం చేసుకోగా వెస్టిండీస్ భీకర పేసర్ కాట్రెల్ ను పంజాబ్ 8.5 కోట్లకి కొనుగోలు చేసింది. అలాగే తమకు అవసరమైన ప్లేయర్లను వెతికి మరీ మాటేసి అనుభవం మరియు కుర్రకారు కలయికతో ఈ రెండు జట్లు చాలా తెలివిగా కొనుక్కున్నా యి.

మరింత సమాచారం తెలుసుకోండి: