ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఈసారి అమ్ముడుపోలేదు. ఖచ్చితంగా భారీ మొత్తానికి పోతారు అనుకున్న వారితో పాటు ఈ మధ్య మంచి ప్రదర్శన కనబరిచిన యువ ఆటగాళ్లు కూడా ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించలేకపోయారు. కొన్ని ప్రపంచ మేటి జట్లలో ఇప్పటికే కీలక పాత్రలు పోషిస్తున్న ఎంత మంది ఆటగాళ్లను మన భారత ఫ్రాంచైజీలు కాదన్నాయి. ఆ దురదృష్టవంతులు ఎవరో ఒక లుక్కేద్దాం.

 

క్రీజులో నిలిస్తే బౌలర్లకు చుక్కలు చూపించే విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ కీ నిరాశే కలిగింది. ఐపీఎల్ కు వచ్చిన కొత్తలో ముస్తాఫిజుర్
రెహ్మాన్ తన పేస్ తో ఎలా వణికించాడో అందరికీ తెలుసు. ఈ సారి అతడివైపు ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు. హ్యాట్రిక్ వీరుడు ఆండ్రూ టై, బెన్ కటింగ్, కార్లోస్ బ్రాత్ సైట్ ను ఈ సారి ఐపీఎల్లో
చూడలేం!

 

భారత క్రికెటర్లు యూసుఫ్ పఠాన్, ఛెతేశ్వర్ పుజారా, స్టువర్ట్ బిన్నీ హనుమ విహారి, మనోజ్ తివారీ, నమన్ ఓజా, బరిందర్ శరణ్, మోహిత్ శర్మ, కేసీ కరియప్ప కథ ఈ సారికి ముగిసినట్టే!  వారితో పాటు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్, శ్రీలంక హార్ట్ హీటింగ్ బ్యాట్స్ మన్ కుశాల్ పెరీరా మరియు న్యూజిలాండ్ ఆల్రౌండర్ లియామ్ ప్లంకెట్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. న్యూజిలాండ్ ఓపెనర్లు కొలిన్ మన్రో మరియు మార్టిన్ గుప్తిల్ ఇద్దరూ ఫ్రాంచెజీలను ఆకర్షించలేకపోయారు.

 

అలాగే న్యూజిలాండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ పై కూడా ఏ ఒక జట్టు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం మరియు వరుస సెంచరీలతో సూపర్ ఫామ్ లో ఉన్న షై హోప్ ను కూడా వారు కాదనడం గమనార్హం. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ కూడా ఈ లిస్టులో చేరేవాడే.... మొదటి సారి అతనిని ఎవరూ తీసుకోలేదు కానీ రెండవ సారి చిచరి నిమిషంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతని కనీస ధర అయిన 2 కోట్లకి సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: