క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన  ఐపీఎల్ 2020  సీజన్ వేలం  నిన్న  కోల్ కత్తా లో జరిగింది. ఇందులో  కొంత మంది  ఆటగాళ్ల వేలం ఆశ్ఛర్యపరిచింది. ఊహించనట్లుగానే వేలం లో ఆస్ట్రేలియా  ఆటగాళ్ల పంట పడింది.  ఆదేశ బౌలర్  పాట్ కమ్మిన్స్ 15.50కోట్ల రికార్డు ధరకు అమ్ముడైయ్యాడు. కమ్మిన్స్  కోసం మొదట ఢిల్లీ ,ఆర్సీబీ  జట్లు నువ్వా-నేనా అన్నట్లు  పోటీ పడ్డాయి. అయితే ఆఖరి నిమిషంలో  కేకేఆర్ రేస్ లోకి వచ్చి అతన్ని ఎగేరేసుకెళ్ళింది.  అలాగే మరో ఆసీస్ ఆటగాడు మ్యాక్స్ వెల్ 10.75 కోట్ల ధర పలికాడు. గట్టి పోటీ నడుమ పంజాబ్ మ్యాక్సీ ని దక్కించుకుంది. వేలంలో ఇదే రెండో అత్యధిక ధర.  వీరితోపాటు వెస్టిండీస్ ఆటగాళ్లు కాట్రేల్ (8.50కోట్లు), హెట్మెయెర్ (7.75కోట్లు),ఇంగ్లాండ్ ఆటగాళ్లు సామ్ కర్రన్ (5.50కోట్లు), ఇయాన్ మోర్గాన్ (5.25కోట్లు) భారీ ధర పలికారు.  అయితే వీరందరికి డిమాండ్ ఉంటుందని ముందే ఊహించినా  అసలు పోటీలో లేని ముగ్గురు ఆటగాళ్లు కూడా  వేలంలో భారీ ధర పలికి ఆశ్ఛర్యపరిచారు.  
 
అందులో మొదటివాడు  సౌతాఫ్రికా అల్ రౌండర్  క్రిస్ మోరిస్... ఐపీఎల్ లో  ఇప్పటివరకు దాదాపు ప్రతి సీజన్ లో యావరేజ్ గా ఆడుతూ వచ్చిన మోరిస్ వచ్చే సీజన్ కోసం ఏకంగా  10కోట్ల  ధర పలికాడు. ఆర్సీబీ అతన్ని సొంతం చేసుకుంది. ఇక రెండోవాడు  నాథన్ కౌల్టర్ నీల్...   ఈ ఆసీస్ అల్ రౌండర్ కూడా  గత సీజన్లలో పెద్దగా  చెప్పుకోతగ్గ ప్రదర్శన  చేయలేకపోయాడు. అయినా కూడా అతన్ని,ముంబై  8కోట్లకు  దక్కించుకుంది. ఇక ఈజాబితాలో  చివరి  ఆటగాడు పీయూష్ చావ్లా..  చావ్లా  టీమిండియా కు ఆడి  కొన్నేళ్లు అవుతుంది. పోనీ  ఐపీఎల్  లో  అతని  ప్రదర్శన  అద్భుతంగా ఉందంటే  అది లేదు కానీ ఈ స్పిన్నర్ కోసం  చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 6.75కోట్ల ను వెచ్చించింది. అలా  ఈముగ్గురు అనుకున్నదానికంటే  ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయి ఆశ్చర్య పరిస్తే  క్రిస్ లిన్ ,  నీషమ్ ,టామ్ బంటన్ వంటి  హాట్ ఫేవరేట్ ఆటగాళ్లను ప్రాంఛైజీలు బేస్ ప్రైస్ కే సొంతం చేసుకొని  షాక్ ఇచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: