టీమిండియా లోకి అప్పుడప్పుడు  కొంతమంది అరుదైన బౌలర్లు వస్తుంటారు ఆ కోవలోకి చెందిన వాడే కుల్దీప్ యాదవ్. టీమిండియా లోకి వచ్చిన యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్  తన స్పిన్ మాయాజాలంతో అద్భుత ప్రదర్శన చేస్తూ టీం ఇండియాలో  లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఎలాంటి ఒత్తిడి లోనైనా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను  కట్టడి చేస్తూ ఎలాంటి పరుగులు ఇవ్వక పోవడమే కాదు కీలక సమయాల్లో వికెట్లను సైతం పడగొట్టి.. టీమిండియా విజయంలో అండగా నిలిచాడు కుల్దీప్ యాదవ్. ఎన్నో సార్లు తన బౌలింగ్తో మాయ చేసాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నాడు అంటే బ్యాట్ మెన్స్  అందరూ కంగారు  పడిపోతుంటారు. కుల్దీప్ యాదవ్ తన మణికట్టు బౌలింగ్  తో  మాయ చేసేస్తుంటాడు . 

 

 

 

 ప్రస్తుతం టీమిండియా లో ఉన్న బౌలర్లు అందరిలో  కుల్దీప్ యాదవ్ మేటి బౌలర్ అని చెప్పవచ్చు. తాజాగా వెస్టిండీస్ ఇండియా మధ్య జరిగిన 2 వన్డేలో  కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఔరా అనిపించాడు. ఓవైపు తన  మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్ మెన్స్ అందరిని కట్టడి చేయడమే కాకుండా... కీలక వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఏకంగా హాట్రిక్ వికెట్లను పడగొట్టాడు ఈ మణికట్టు మాయాజాల ఆటగాడు కుల్దీప్ యాదవ్. దీంతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో టీమిండియా తరపున రెండుసార్లు హాట్రిక్  చేసిన ఏకైక బౌలర్ గా  కుల్దీప్ యాదవ్ సరికొత్త రికార్డును సృష్టించాడు. టీమిండియా నుంచి ఏ ఒక్క బోర్డర్ కి కూడా ఈ  రికార్డు ఇప్పటివరకు సాధ్యం కాలేదు. అయితే భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 

 

 

 

 అయితే తాజాగా కుల్దీప్ యాదవ్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటికే రెండుసార్లు హ్యాట్రిక్ సాధించి ఎవరికీ సాధ్యం కాని రికార్డును సృష్టించిన కుల్దీప్ యాదవ్.. ఇంకొక వికెట్ తీస్తే తక్కువ సమయంలో వంద వికెట్లు తీసిన బౌలర్ ల  ఖాతాలో చేరిపోతాడు కుల్దీప్ యాదవ్. ఒక్క వికెట్ తీసాడంటే  ఇప్పటికే అతి వేగంగా వంద వికెట్లు తీసిన రికార్డు సృష్టించిన షమీ తో సమం అవుతాడు  కుల్దీప్ యాదవ్. టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీ 56 వన్డేల్లో 100 వికెట్లు తీయగా.. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 55 వన్డేలో 99 వికెట్లు తీశాడు.  కటక్ వేదికగా జరగబోయే వెస్టిండీస్ ఇండియా మధ్య మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్ మరో వికెట్ తీస్తే... వంద వికెట్లు పడగొట్టిన 22వ భారత బౌలర్ గా ఎనిమిదవ స్పిన్నర్ గా రికార్డు లకు  ఎక్కుతాడు కుల్దీప్ యాదవ్.

మరింత సమాచారం తెలుసుకోండి: