ఆ ఆటగాడు టీం ఇండియా స్టార్ ఓపెనర్... ఒకసారి బరిలోకి దిగాడు  అంటే బాల్ గాల్లోనే తేలుతూ ఉంటుంది. ఒక్కసారి బ్యాట్ జులిపించాడు  అంటే బౌలర్ల  వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అలవోకగా డబుల్ సెంచరీలు చేయగల సత్తా అతని సొంతం.. పరుగుల వరద పారిస్తు  రికార్డులు సృష్టించడం అతని నైజం... అతనే  టీం ఇండియా వైస్ క్యాప్టెన్  రోహిత్ శర్మ. రోహిత్ శర్మ తన అద్భుతమైన బ్యాటింగ్ తో  ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించాడు. ఎన్నోసార్లు భారత్ ను  విజయ తీరాల వైపు నడిపించాడు రోహిత్ శర్మ. మంచి బాట్స్ మెన్ గానే కాకుండా ఒక వైస్ కెప్టెన్గా కూడా బాధ్యతలు చేపట్టి టీమిండియాను ముందుండి నడిపించాడు రోహిత్ శర్మ. డబుల్ సెంచరీలు చేయడంలో రోహిత్ శర్మ కు ప్రత్యేక రికార్డు ఉందన్న విషయం తెలిసిందే. 

 

 

 

 విశాఖ వేదికగా వైయస్ రాజశేఖర్రెడ్డి స్టేడియంలో జరిగిన భారత్ వెస్టిండీస్ రెండో వన్డే మ్యాచ్ లో  రోహిత్ శర్మ తన అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు భారీ స్కోరును తీసుకొచ్చాడు. ఓపెనర్ గా  బరిలోకి దిగిన రోహిత్ శర్మ మొదటి బాల్ నుంచి మెరుపులు మెరిపించారు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసి ... బౌలర్ల  వెన్నులో వణుకు పుట్టించాడు రోహిత్ శర్మ. అసలు సిసలైన ఓపెనర్ అంటే ఇలా ఉంటాడు చాటి చెప్పాడు రోహిత్ శర్మ . అయితే తన అద్భుతమైన బ్యాటింగ్తో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన శర్మ... మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంకా 9 పరుగులు చేస్తే చాలు  సరికొత్త రికార్డు సృష్టిస్తాడు రోహిత్ శర్మ

 

 

 ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 2,379 పరుగులు చేశాడు. ఇంకొక 9 పరుగులు చేస్తే ఒక్క ఏడాది లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు  రోహిత్ శర్మ. శ్రీలంక మాజీ ఓపెనర్ జయసూర్య  1997 లో ఒకే ఏడాదిలో రెండు 2,387 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. గత 22 ఏళ్ల నుంచి ఏ ఆటగాడు కూడా ఈ రికార్డు దరి చేరలేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఈ  రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంకొక 9 పరుగులు చేస్తే రోహిత్ శర్మ ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్గా 22 ఏళ్ళ రికార్డులు బద్దలు కొడతాడు . కాగా  నేడు జరగబోయే వెస్టిండీస్ ఇండియా మూడో వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ 9 పరుగులు చేసి ఈ రికార్డును బ్రేక్ చేస్తాడా లేదా అన్నది అభిమానుల్లో  ప్రస్తుత ఉత్కంఠగా మారింది. ఇకపోతే టీమిండియా మూడో వన్డే గెలిస్తేనే సిరీస్ను సొంతం చేసుకోగలదు. అయితే సిరీస్ను సొంతం చేసుకోవడానికి టీమిండియాకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో వెస్ట్ ఇండీస్ కు కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి . ఈ నేపథ్యంలో మ్యాచ్ లో ఎవరు గెలిచినా సిరీస్ ఎగరేసుకు పోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: