మూడు వన్డేల సిరీస్ లో భాగంగా  వెస్టిండీస్ -భారత్ లమధ్య   మూడో మ్యాచ్  ఆదివారం కటక్ లో జరుగనుంది. సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్ కావడంతో మూడో వన్డే  పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  కాగా ప్రస్తుతం  సిరీస్ లో  మొదటి  మ్యాచ్ లో  వెస్టిండీస్ విజయం సాధించగా  రెండో మ్యాచ్ లో  భారత్ విజయం సాధించింది. దాంతో  సిరీస్ 1-1 తో సమం అయ్యింది. ఇక  ఈమూడో మ్యాచ్ ను కూడా గెలుచుకొని  సిరీస్ ను కైవసం చేసుకోవాలని  ఇరు జట్లు  పట్టుదలతో వున్నాయి.   
 
 
 అయితే   మూడో వన్డే  కు ముందు  భారత్ కు  ఎదురు దెబ్బ తగిలింది.  యువ  ఫాస్ట్ బౌలర్  దీపక్ చాహర్  గాయం కారణంగా   జట్టుకు దూరమైయ్యాడు.  దాంతో  అతని  స్థానంలో  డిల్లీ పేసర్  నవదీప్ సైనీని ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ.  ఇక  ఇప్పటికే  అంతర్జాతీయ  టీ 20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన   సైనీ తాజాగా కటక్ వన్డే తో  వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లే. ఈఒక్క మార్పు తప్ప  మూడో వన్డే లో  వైజాగ్  లో గెలిచిన టీం తోనే భారత్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఇక  వెస్టిండీస్ కూడా  ఒక్క మార్పుతోనే  బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా   స్పిన్నర్  పియరీ స్థానంలో మరో స్పిన్నర్  హేడెన్ వాల్ష్ ను తీసుకోనుంది.  మరి ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను ఎవరు  దక్కించుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: