భారత్ వైస్ కెప్టెన్ , ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన  రికార్డు నెలకొల్పగా , వెస్టిండీస్ ఓపెనర్ హొప్ మాత్రం ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు  . ఓపెనర్ గా ఒక క్యాలెండర్ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి గా రోహిత్ శర్మ, సవరించి , తన పేరిట నమోదు చేసుకున్నాడు . కటక్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత్ భారీ లక్ష్య ఛేదన తో బరిలోకి దిగింది . ఓపెనర్ రాహుల్ లోకేష్ , రోహిత్ శర్మ లు ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు .

 

రోహిత్ వ్యక్తిగత స్కోర్ తొమ్మిది పరుగుల వద్దకు చేరుకోగానే , శ్రీలంక మాజీ కెప్టెన్ , ఓపెనర్ సనత్ జయసూర్య  పేరిట 22 ఏళ్ల పాటు పదిలంగా   ఉన్న రికార్డు బద్దలయింది . 1997  లో సనత్ జయసూర్య  2 , 387 పరుగులు సాధించి ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన ఓపెనర్ బ్యాట్స్ మెన్ గా రికార్డు నెలకొల్పాడు  .  ప్రస్తుత సంవత్సరం సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్ ఆ రికార్డు ను బద్దలు కొట్టి తన పేరిట లిఖించుకున్నాడు . మరొక వైపు 26 ఏళ్లుగా విండీస్ దిగ్గజ బ్యాట్స్ మెన్  బ్రియాన్ లారా పేరిట ఉన్న రికార్డును అధిగమించే అవకాశం హొప్ మిస్సయ్యాడు .

 

విండీస్ తరుపున ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు  గత 26 ఏళ్లుగా లారా పేరిటే ఉంది . లారా 1993 లో ఒక క్యాలెండర్ ఇయర్ లో 1349 పరుగులు సాధించాడు . హొప్ చివరి వన్డే లో 42  పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయి, లారా రికార్డును సవరించే అవకాశాన్ని కోల్పోయాడు . హొప్ ఇప్పటి వరకు  ఈ ఏడాది 1345 పరుగులుసాధించాడు .  

మరింత సమాచారం తెలుసుకోండి: