భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. జులైలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలతో జోరు అందుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ.. తాజాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భారీ శతకంతో దూకుడు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఈ రోజు వెస్టిండీస్ తో జరిగుతున్న చివరి వన్డే కి ముందు అన్ని ఫార్మాట్లలో కలిపి 2,379 పరుగులు చేసిన రోహిత్ శర్మ మరో 9 పరుగులు చేస్తే ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా అరుదైన ఘనత ముంగిట నిలువగా ఈ రోజు ఆ రికార్డుని రికార్డ్ బ్రేక్ చేశాడు.

 

లంక దిగ్గజ ఓపెనర్ సనత్ జయసూర్య 1997లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 2,387 పరుగులు చేయగా.. అప్పటి నుంచి ఈ రికార్డ్‌కి ఏ క్రికెటర్ కూడా చేరువ కాలేకపోయాడు. కానీ.. ఈ ఏడాది కెరీర్‌లోనే బెస్ట్ ఫామ్‌లో కొనసాగుతున్న రోహిత్ శర్మ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసేశాడు.

 

316 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేశారు. కేఎల్ రాహుల్ 49 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, రోహిత్ శర్మ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్...5 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

 

ప్రస్తుతానికి భారత్ 4 వికెట్లు కోల్పోగా ఇంకా 13 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ దిశగా పరుగులు తీస్తున్నాడు. భారత జట్టు స్వల్ప వ్యవధిలో రాహుల్, అయ్యర్ మరియు పంత్ వికెట్లను కోల్పోయింది. భారత్ ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఇంకా 106 పరుగులు చేయాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: