టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఇప్పటికే పలు వరల్డ్‌ రికార్డులను సాధించారు .. మరో ప్రపంచ రికార్డును తాజాగా  నెలకొల్పాడు.  అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో  అత్యధిక పరుగులు సాధించిన రికార్డును రోహిత్‌ సాధించాడు. ఈ క్రమంలోనే 22 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న శ్రీలంక మాజీ ఓపెనర్‌ సనత్‌ జయసూర్య రికార్డును బ్రేక్‌ చేశాడు. నిర్ణయాత్మక మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరిదైన సిరీస్‌ లో  రోహిత్‌ ఈ ఘనత సాధించాడు.

 

రోహిత్‌  విండీస్‌ నిర్దేశించిన 316 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా 9 పరుగుల వద్ద  ఉండగా ఈ ఫీట్‌ను సాధించాడు. 1997లో అన్ని ఫార్మాట్లలో సనత్‌ జయసూర్య  2,387 పరుగులు ఆ క్యాలెండర్‌ ఇయర్‌లో సాధించాడు. దాంతో  అత్యధిక పరుగులు ఓపెనర్‌గా సాధించిన రికార్డును జయసూర్య సాధించాడు. దాన్ని రోహిత్‌  తాజాగా  బ్రేక్‌ చేసి సరికొత్త వరల్డ్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.  రోహిత్‌ శర్మనే  ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో కూడా టాప్‌లో కొనసాగుతుండటం విశేషం. రోహిత్‌ శర్మ   విండీస్‌తో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థ శతకం నమోదు చేశాడు. 

కాగా, ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి టీమిండియా కెప్టెన్‌ 2,370 పరుగులతో విరాట్‌ కోహ్లి  ఉన్నాడు. 2016 నుంచి చూస్తే వరుసగా మూడేళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల పరంగా టాప్‌తోనే ముగించాడు కోహ్లి. 2016లో 2,595 పరుగులతో కోహ్లి టాప్‌ను సాధించగా, 2,818 పరుగులతో 2017లో  అగ్రస్థానాన్ని సాధించాడు. 2018లో 2,735 పరుగులతో టాప్‌ను దక్కించుకున్నాడు.

 

తద్వారా ‘హ్యాట్రిక్‌’ను సాధించాడు కోహ్లి. ఫలితంగా వరుసగా మూడు సంవత్సరాల పాటు టాప్‌లో నిలిచిన ఏకైక ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.  విండీస్‌తో మ్యాచ్‌లో రోహిత్‌తో పాటు కేఎల్‌ రాహుల్‌ కూడా అర్థ శతకం సాధించాడు. భారత్‌ 19 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 109 పరుగులు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: