కటక్ వేదికగా  వెస్టిండీస్ తో జరిగిన  చివరి  వన్డేలో భారత్  4వికెట్ల తేడాతో  విజయం సాధించింది.  ఉత్కంఠ భరితంగా  సాగిన ఈ మ్యాచ్   క్రికెట్ అభిమానులకు  అసలైన మజాను అందించింది.  మొదటగా  బ్యాటింగ్ చేసిన  విండీస్  నిర్ణీత  50ఓవర్లలో  5వికెట్ల నష్టానికి  315పరుగులు  చేసింది.  పూరన్ 89, కెప్టెన్ పోలార్డ్ 74, హోప్ 42 పరుగుల తో  రాణించారు.  ఇక ఈ మ్యాచ్ తో  వన్డేల్లో కి ఎంట్రీ ఇచ్చిన యువ  బౌలర్  సైనీ  2కీలక వికెట్లతీయగా షమీ ,శార్దూల్ ఠాకూర్ ,జడేజా తలో వికెట్ పడగొట్టారు. 
 
అనంతరం  భారీ లక్ష్యం  తో బరిలోకి దిగిన   భారత్ కు ఓపెనర్లు  రాహుల్ ,రోహిత్  మరోసారి అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు.  వీరిద్దరూ  చక్కటి  సమన్వయంతో  ఆడుతూ  స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు. వీరి జోరు చూస్తే  టీమిండియా గెలుపు  నల్లేరు  పై నడకే అనిపించింది.  అయితే 23ఓవర్లో  హోల్డర్ ఈజోడిని  విడదీశాడు.  ఆ ఓవర్  రెండో బంతికి  కీపర్ కు క్యాచ్ ఇచ్చి రోహిత్(63)  వెనుదిరిగాడు. ఆతరువాత వచ్చిన కోహ్లీ , రాహుల్  అండతో  జట్టును లక్ష్యం వైపు నడిపించాడు.  ఈ దశలో మరో  సెంచరీ చేసేలా కనిపించిన  రాహుల్(77) ను అల్జారీ జోసఫ్  బోల్తాకొట్టించాడు. ఆతరువాత  కాసేపటికే  శ్రేయాస్ అయ్యర్ , రిషబ్ పంత్ , కేదార్ జాదవ్ లు కూడా  అవుట్ కావడంతో  టీమిండియా కష్టాల్లో  పడింది.  ఈక్రమంలో  అల్ రౌండర్  జడేజా,  కోహ్లీకి అండగా నిలిచాడు. అయితే 286పరుగుల కోహ్లీ  కూడా అవుట్ కావడంతో  భారత్ అభిమానుల్లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అయితే జడేజా(39*)కుతోడు 8వస్థానం లో వచ్చిన  శార్దూల్ ఠాకూర్ 6బంతుల్లో రెండు ఫోర్లు , ఓ సిక్సర్ సాయంతో 17*పరుగులతో మెరుపులు మెరిపించడం తో  భారత్ మరో  8బంతులు మిగిలి వుండగానే  విజయం సాధించి సిరీస్ ను 2-తో కైవసం చేసుకుంది.  కోహ్లీ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్  అవార్డు  దక్కగా రోహిత్ శర్మను  మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: