2019 భారత క్రికెట్ కు మరపురాని సంవత్సరం క్రికెట్ వరల్డ్ కప్ గెలవలేదు అన్న ఒక్క బాధ తప్ప మిగతా అన్ని విషయాల్లో భారత్ మెరుగ్గా రాణించింది అనే చెప్పాలి. ఇందులో ఇద్దరి పాత్ర కీలకంగా ఉంది. ఒకరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంకొకరు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్ రోహిత్ శర్మ గత ఐదు సంవత్సరాలుగా నిలకడగా రాణిస్తున్నారు. 2019 సంవత్సరంలో రోహిత్ శర్మ బద్దలుకొట్టిన రికార్డులు ఒకసారి చూద్దాం.

 

1.రోహిత్ శర్మ ఓపెనర్ గా ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే రెండు సెంచరీలు కొట్టి ఆల్ టైం రికార్డు సంపాదించాడు.

 

2. రోహిత్ శర్మ క్రికెట్ వరల్డ్ కప్ లో వరుసగా మూడు మ్యాచ్ల్లో  3 సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

 

3. వరల్డ్ కప్ లో చేసిన ఐదు సెంచరీలు మూడు సెంచరీలు ఛేజింగ్ చేసే సమయంలో వచ్చినవి ఇది కూడా ఒక రికార్డు.

 

4. వరల్డ్ కప్ లో ఒకేసారి ఐదు సెంచరీలు కొట్టిన ఒకే ఒక ఆటగాడు రోహిత్ శర్మ.

 

5. వరల్డ్ కప్ లో మొత్తం ఆరు సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేశాడు రోహిత్ శర్మ.

 

6. 2019 లో మొత్తం 10 సెంచరీలు చేసిన రోహిత్ శర్మ అవి ఏడు దేశాల మీద చేశాడు.

 

7. వైజాగ్ లో చేసిన 159 పరుగులు అతనికి వన్డేల్లో ఎనిమిదోవ 150 పైగా స్కోరు.

 

8. ఓపెనర్ గా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు కొట్టిన తొమ్మిదవ ఓపెనర్ రోహిత్ శర్మ.

 

9. ఒక క్యాలెండర్ ఇయర్లో 10 సెంచరీలు కొట్టిన తొలి ఓపెనర్ రోహిత్ శర్మ. అలాగే వన్డేలో ఈ సంవత్సరం అత్యధిక పరుగుల వీరుడు కూడా రోహిత్ శర్మనే. 

మరింత సమాచారం తెలుసుకోండి: