గత  నాలుగు  సంవత్సరాల నుండి  అంతర్జాతీయ క్రికెట్ లో  మూడు  ఫార్మట్ లలో అత్యధిక  పరుగులు చేసిన  ఆటగాడిగా  టీమిండియా సారథి  ,కింగ్ కోహ్లీ  అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2016లో 2595 పరుగులు 2017లో 2818 పరుగులు ,2018లో 2735పరుగులు, 2019లో 2455పరుగులు  చేసి కోహ్లీ  వరుసగా  నాలుగో సంవత్సరం కూడా  అత్యధిక పరుగులు  చేసిన  ఆటగాడిగా  సత్తా చాటాడు.  అలాగే నిన్న  వెస్టిండీస్ తో జరిగిన చివరి వన్డే లో 85పరుగులు చేసి   విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లీకి  'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఇది కోహ్లీకి 57వది.   దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక  మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌ లు పొందిన క్రికెటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్వస్‌ కలిస్ (57 సార్లు)తో సమంగా నిలిచాడు. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్  సచిన్‌ తెందుల్కర్‌ (76 సార్లు), శ్రీలంక మాజీ ఓపెనర్ జయసూర్య (58 సార్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
 
ఇక  ఈ క్రమంలో  కోహ్లీ  మరో అరుదైన  ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కలిస్‌ (11,579)ను అధిగమించి కోహ్లీ (11,609) ఏడో స్థానానికి చేరుకున్నాడు.  ఈ  జాబితాలో కోహ్లీ కంటే ముందు సచిన్ (18,426), కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్‌ (13,704), జయసూర్య (13,430), జయవర్ధనే (12,650), ఇంజమాముల్ హక్‌ (11,739) ఉన్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: