భారత క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్లో ఎక్కువ పాత్ర స్పిన్నర్ లపై ఉండేది, సాంప్రదాయ బద్ధంగా కొన్ని దశాబ్దాలుగా భారత క్రికెట్ జట్టు బౌలింగ్ భారమంతా కూడా స్పిన్నర్లు చాలా కాలం మోశారు. పాత కాలంలో ఏరాపల్లి ప్రసన్న, శ్రీనివాస్ వెంకట రాఘవన్, భగవత్ చంద్ర శేఖర్ , బిషన్ సింగ్ బేడీ  ఆ తర్వాత అనిల్ కుంబ్లే చాలా సంవత్సరాల పాటు భారత బౌలింగ్ విభాగాన్ని తన భుజస్కంధాల మీద మోసాడు. ఇక ఆ తర్వాత హర్భజన్ సింగ్ ఆ సంప్రదాయాన్ని కొనసాగించాడు.

 

ఇక గత దశాబ్దంలో భారత క్రికెట్ జట్టులో ఇద్దరు స్పిన్నర్లు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రవిచంద్రన్ అశ్విన్ 2011లో క్రికెట్ లో ఆరంగేట్రం చేసిన అనతి కాలంలోనే భారత క్రికెట్ జట్టు ముఖ్య బౌలర్ గా ఎదిగాడు; గత దశాబ్దంలో మొత్తం 564 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. అలాగే ఈ దశాబ్దంలో మ్యాచ్ లో అత్యధికంగా పది వికెట్లు సాధించిన బౌలర్ గా కూడా రికార్డు సృష్టించాడు.

 

 క్రికెట్ మ్యాచ్ లో మనము ఎప్పటికీ కూడా బ్యాట్స్మెన్ రికార్డుల గురించి పట్టించుకుంటారు కానీ బౌలర్ రికార్డుల గురించి అంతగా మాట్లాడుకోము. గత దశాబ్దంలో భారతదేశం తరఫున ఎన్నో రికార్డులు సృష్టించారు భారత్ తరఫున అతి వేగంగా 50,100,150,200,250,300,350 వికెట్లు తీసిన బౌలర్ గా అశ్విన్ పేరిట ఈ రికార్డు ఉంది.

 

ఇప్పటివరకు భారతదేశం తరఫున 65 టెస్ట్ మ్యాచ్ లో పాల్గొన్న అశ్విన్ అందులో 342 వికెట్లు అలాగే వన్డేల్లో 150కిపైగా వికెట్లు టీ20 లో కూడా 50కిపైగా వికెట్లు సాధించాడు. ఈ సందర్భంగా బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అశ్విన ని అభినందిస్తూ ట్విట్టర్లో తన ఆనందాన్ని పంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: