భారత క్రికెట్ జట్టు రూపురేఖలు మార్చిన వ్యక్తిగా సౌరవ్ గంగూలీ కి ఎనలేని పేరు ఉంది. బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత సౌరవ్ గంగూలీ ఎన్నో మార్పులు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా భారత దేశ జట్టు తన తొలి పింక్ మ్యాచ్ ని కూడా ఆడేలా చేశాడు. ఇక ఆ తర్వాత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల గురించి కూడా ఆలోచిస్తాను అని ప్రకటించాడు. ఇవన్నీ కూడా భారత క్రికెట్ జట్టుకి ఎంతో మంచి పరిణామాలు.

 

 అతి తక్కువ కాలంలోనే భారత జట్టుకు ఎంతో ముఖ్యమైన ఆటగాడిగా మారాడు జస్ప్రిత్ బూమ్రా. ప్రపంచకప్ తర్వాత జరిగిన వెస్టిండీస్ టూర్ లో గాయం పడిన బూమ్రా ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. దాదాపు ఐదు నెలల కాలం పాటు విశ్రాంతి తీసుకున్నాడు, ఈ మధ్యనే గాయం నుంచి కోలుకున్న బుమ్రా జట్టులోకి తిరిగి ప్రవేశించాడు. వచ్చే నెలలో జరగనున్న శ్రీలంక టూరు అలాగే ఆస్ట్రేలియా టూర్ లో కూడా అతని సెలెక్ట్ చేసారు.

 

 ఈ సందర్భంగా బుమ్రా గుజరాత్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడించాలని అనుకున్నారు. కానీ అతని పని ఒత్తిడి గురించి ఆలోచించి బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రంగంలోకి దిగాడు. మొదట కేవలం 12 ఓట్లు మాత్రమే ఓవర్లు వేయించాలని నిర్ణయించారు. కానీ సౌరవ్ గంగూలీ రాకతో బూమ్రా పూర్తిగా మ్యాచ్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 

ఈ విషయాన్ని గుజరాతి రంజి టీం కెప్టెన్ పార్థివ్ పటేల్ ధ్రువీకరించాడు. నిజానికి ఫిబ్రవరిలో జరిగే న్యూజిలాండ్ మ్యాచ్లకి బూమ్రా ఎంతో కీలకం కాబట్టి అప్పటి వరకు చాలా జాగ్రత్తగా అతని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్పటికైనా రాష్ట్ర జట్టు భవిష్యత్తు కంటే కూడా భారతదేశ జట్టు భవిష్యత్తు ఎంతో ముఖ్యమని మరోసారి గంగూలీ స్పష్టం చేశాడు

మరింత సమాచారం తెలుసుకోండి: