భారత్ క్రికెట్ జట్టు వచ్చే సంవత్సరం జనవరిలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో ఆడబోతుంది. జనవరి 14 నుంచి ఈ సిరీస్ ప్రారంభం అవ్వనుండగా తొలి వన్డే మ్యాచ్‌ ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత 17న రాజ్‌ కోట్‌ లో రెండో వన్డే, ఆఖరిగా 19న బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో చివరి వన్డేతో ఈ సిరీస్‌ ముగుస్తుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ కోసం ఇప్పటికే భారత్ జట్టుని సెలక్టర్లు తెలిపారు. మ్యాచ్‌ లన్నీ మధ్యాహ్నం 2 గంటలకి నుంచి ప్రారంభం అవుతాయి.

 


ఆస్ట్రేలియాతో ఆడే భారత వన్డే జట్టు ఇలా ఉంది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, శివమ్ దూబే, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, నవదీప్ షైనీ, జస్‌ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ

 

భారత్ జట్టులో రోహిత్, ధావన్, రాహుల్ రూపంలో మొత్తం ముగ్గురు ఓపెనర్లకి చోటు దక్కగా, ఫాస్ట్ బౌలర్ జస్‌ ప్రీత్ బుమ్రాతో కలిపి మహ్మద్ షమీ బంతిని పంచుకోనున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ జోడీ మళ్లీ కలిసి బౌలింగ్ కు రాబోతుంది. వెన్ను గాయం కారణంగా గత మూడు నెలలుగా క్రికెట్‌ కి బుమ్రా దూరంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే.

 

ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌ నెస్ సాధించలేకపోవడంతో అతని స్థానంలో శివమ్ దూబేకి మళ్లీ అవకాశం వచ్చింది. అలానే ఫాస్ట్ బౌలర్లు శార్ధూల్ ఠాకూర్, నవదీప్ షైనీకి మరోసారి సెలక్టర్లు ఛాన్స్ ఇవ్వగా, కేదార్ జాదవ్‌కి కూడా ఆఖరి అవకాశాన్ని ఇచ్చినట్లు కనపడుతోంది. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌ లో జాదవ్ బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: