బంగ్లాదేశ్ సృష్టికర్త షేక్ ముజిబుర్ రెహమాన్  జయంతి సందర్భంగా  ఆదేశ  క్రికెట్ బోర్డు  వచ్చే ఏడాది  మార్చి లో  ఆసియా ఎలెవెన్ అలాగే  వరల్డ్ ఎలెవన్  జట్ల  మధ్య  రెండు  టీ 20 మ్యాచ్ లు నిర్వహించడానికి రెడీ అవుతుంది. ఇందులో  ఆసియా ఎలెవన్ తరపున ప్రాతినిధ్యం వహించడానికి  భారత ఆటగాళ్ల ను కూడా పంపాలని  cricket BOARD' target='_blank' title='బీసీబీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బీసీబీ ఇప్పటికే  బీసీసీఐ ను  కోరింది.  బీసీసీఐ కూడా అందుకు అంగీకరించింది. 
 
 
అయితే ఆసియా ఎలెవన్  లో  పాకిస్థాన్  ఆటగాళ్లు కూడా  ఉంటారని  ఇటీవల వార్తలు  వచ్చాయి. దాంతో  వాళ్ళతో కలిసి  మనవాళ్ళు  ఎలా ఆడతారని భారత క్రికెట్ అభిమానుల నుండి  విమర్శలు వచ్చాయి.  తాజాగా  దీనిపై బీసీసీఐ కోశాధికారి  జయేష్ జార్జ్  స్పందించాడు.  ఆసియా ఎలెవన్ లో పాక్ ఆటగాళ్లు వుండరు...  రెండు జట్ల ఆటగాళ్లు  కలిసి  ఒకే జట్టు తరపున ఆడే ఛాన్సే లేదు అలాగే   ఈ మ్యాచ్ లకు  టీమిండియా నుండి 5గురు  ఆటగాళ్లను మాత్రమే  పంపుతామని  ఆ ఆటగాళ్లు ఎవరనేది  బీసీసీబీ  అధ్యక్షడు  సౌరవ్ గంగూలీ  నిర్ణయిస్తాడని జయేష్ వెల్లడించాడు.  మరి ఆ 5గురిలో ధోని  ఉంటాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: