టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఆ గౌరవం ఏంటి అనుకుంటున్నారా ? అదే.. అయన టీమిండియా రన్   మెషీన్ గా విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. విజ్డన్ ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో కోహ్లీకి చోటు దక్కింది. కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్లు డేల్ స్టెయిన్, ఏబీ డివిలియర్స్, అలాగే ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, విమెన్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ అనే ఐదుగురికి కూడా ఈ దశాబ్దపు క్రికెటర్ల జాబితాలో చోటు లభించింది.

 

గత పది సంవత్సరాల్లో విరాట్ కోహ్లీ ఎవరికి సాధ్యం కానంతగా మిగతా వారికంటే అదనంగా 5,775 పరుగులు చేశాడు. దీంతో 31 ఏళ్ల కోహ్లీని 'విజ్డన్ టెస్ట్ టీం ఆఫ్ ది డెకేడ్' జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించింది. కోహ్లీ అత్యంత మేధావని, ఎప్పటికప్పుడు సవాళ్లను ఎదుర్కొని ఎదగాడని విజ్డన్ కీర్తించింది. 

 

2014లో ఇంగ్లండ్ పర్యటన ముగిసినప్పటి నుంచి నవంబరులో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మధ్య కోహ్లీ 63 సగటుతో 21 సెంచరీలు, 13 అర్ధ సెంచరీ సాధించాడని చెప్పింది. ఈ గణాంకాలు అతడిని ప్రత్యేక ఆటగాడిగా గుర్తిస్తున్నాయని, మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలోనూ 50 సగటు కలిగిన ఒకే ఒక్క బ్యాట్స్‌మన్ కోహ్లీ అని విజ్డన్ పేర్కొంది. స్మిత్ ఆ మార్క్‌కు చేరుకున్నా.. కోహ్లీ అంత వేగంగా కాదని విజ్డన్ స్పష్టం చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: