ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయే ప్రేక్షకులు ఎంతో మంది. ఇక తమ ఫేవరెట్ టీం ఆడుతుంది అంటే అబ్బో ఇక ఆ కిక్కే వేరు ఉంటుంది. తన ఫేవరెట్ ప్లేయర్ సిక్స్ కొట్టాడు  అంటే ఎగిరి గంతేయ్యల్సిందే .. తన ఫేవరెట్ బౌలర్ క్వికెట్  పడగొట్టాడు అంటే తెగ ఎంజాయ్ చేయాల్సిందే. అలా ఉంటుంది క్రికెట్ చూసే ప్రేక్షకుల పరిస్థితి. ఇకపోతే ఆటగాళ్లు కూడా రికార్డులు బద్దలు కొట్టడానికి తహతహలాడుతుంటారు. తమ పేరుతో సరికొత్త రికార్డు నెలకొల్పడానికి ఎప్పుడు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అతి తక్కువ సమయంలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. 

 

 

 

 చిన్న వయసులోనే గొప్ప రికార్డులను సైతం అందుకున్న ఆటగాళ్లు క్రికెట్ లో ఎంతోమంది. అయినప్పటికీ వాళ్ళ రికార్డు బ్రేక్ చేయడానికి వేరే  ఆటగాళ్లు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. క్రికెట్ లో మరొకరి రికార్డును బ్రేక్ చేసి ఆ రికార్డును తమ పేరు ఎక్కించుకోవడం అబ్బో అది గొప్ప విషయమే కదా. అందుకే ఆటగాళ్ళందరూ ఎప్పుడూ సరికొత్త రికార్డును నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రికార్డులు బద్దలు కొట్టడం అంటే మామూలు విషయం ఏమీ కాదు కదా... ఆ రికార్డులు బద్దలు కొట్టడం వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ పట్టుదల దృఢ  సంకల్పం ఉంటాయి. ఇవన్నీ ఉంటే గాని రికార్డు బద్దలు కొట్టగలం.. రికార్డ్ అంటే అంత ఈజీ కాదు కదా  సుమీ. అయితే తాజాగా టి20లో మరో సరికొత్త రికార్డు నమోదు అయింది. 

 

 

 20 క్రికెట్లో మరో రికార్డు బద్దలు కొట్టాడు ఆటగాడు. అతి పిన్న వయసులోనే వంద వికెట్లు రికార్డు తీసిన బౌలర్ గా రికార్డ్  సృష్టించాడు. ఈ ఆటగాడు ఎవరు కాదు.. తనదైన స్టైల్ బౌలింగ్ తో  ప్రత్యర్థి బ్యాట్ మెన్ల  వెన్నులో వణుకు పుట్టిస్తూ జట్టుకు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్తాన్ యువ సంచలనం మజీద్ ఉర్ రెహమాన్. అతను 18 సంవత్సరాల 271 రోజుల్లోనే (97 మ్యాచులు ) 100 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకు ముందుగా ఆఫ్ఘనిస్తాన్ స్పిన్  మాయాజాలం రషీద్ ఖాన్.. 18 సంవత్సరాలు 365 రోజుల్లో (66) మ్యాచులు ఈ రికార్డును సృష్టించాడు. ప్రస్తుతం రషీద్ ఖాన్ రికార్డును మజిద్ ఉర్  రెహమాన్ బద్దలు కొట్టాడు. ఇకపోతే ఈ లిస్టులో భారత్ తరఫునుంచి బూమ్రా 23 సంవత్సరాల 57 రోజుల్లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: