ఒక్కసారి బ్యాటు పట్టి  బరిలోకి దిగాడు అంటే పరుగుల వరద పారిస్తాడు ...  డబుల్ సెంచరీలు సాధించడంలో  ఈ ఆటగాడు దిట్ట... అలవోకగా సిక్సర్లు కొట్టడం ఆటగాడి నైజం... ప్రత్యర్థి బౌలర్లు  ఎవరైనా పరుగుల వరద పారిస్తూ  జట్టును విజయతీరాలకు వైపు నడిపించగల సత్తా అతని సొంతం. ఈ ఆటగాడు ఎవరో కాదు టీమిండియా వైస్ కెప్టెన్ సిక్సుల  వీరుడు డబుల్ సెంచరీల ధీరుడు రోహిత్ శర్మ. తన ఆటతో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉంటాడు రోహిత్  శర్మ . ఎలాంటి పరిస్థితుల్లోనైనా చెలరేగి ఆడి జట్టుకు భారీ స్కోరు వైపుగా నడిపిస్తున్నాడు. టీమిండియా డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్గా...జట్టుకు  ముందుకు నడిపించే వైస్ క్యాప్టెన్ గా... బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించే స్టార్ బ్యాట్స్ మెన్ గా  ఇలా చెప్పుకుంటూ పోతే రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలవోకగా డబుల్ సెంచరీలు చేయగల సత్తా రోహిత్ సొంతం. 

 


 అందుకే రోహిత్ శర్మ నీ అభిమానులందరూ హిట్ మాన్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఒకసారి రోహిత్ శర్మ మైదానంలోకి అడుగు పెట్టాడు అంటే బాల్ మైదానంలో కనిపించదు మొత్తం గాల్లోనే తేలుతూ ఉంటుంది. ఎందుకంటే అలాంటి సొగసైన షాట్లు కొడుతూ భారీ సిక్సులు బాదుతూ  ఉంటారు రోహిత్ శర్మ. ఇప్పటికే తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన తో టీమ్ ఇండియా జట్టు కు ఎన్నో విజయాలను అందించాడు. ప్రపంచ కప్ లో కూడా తన బ్యాట్ తో  మెరుపులు మెరిపిస్తూ అద్భుత ప్రదర్శన చేశాడు రోహిత్ శర్మ. మ్యాచ్  ఎలాంటి పరిస్థితిలో ఉన్న భారీ షాట్లు కొడుతూ బౌలర్ల  వెన్నులో వణుకు పుట్టించగలడు  రోహిత్ శర్మ. అందుకే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు  అంటే క్రికెట్ ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు.


 ఇకపోతే అండర్ 19 జట్టుగా వరల్డ్ కప్ లో కి బరిలోకి దిగుతున్న టీమిండియా జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు రోహిత్ శర్మ. బంతిని గాల్లోకి లేపుతూ భారీ షాట్లు ఆడటం నేరం కాదని టీమిండియా స్టార్ ఓపెనర్ హిట్ మాన్ రోహిత్ శర్మ అన్నాడు. ఇదే సమయంలో మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని... దానికి అనుగుణంగానే హిట్టింగ్ చేసి సానుకూల ఫలితాలను సాధించాలని రోహిత్ శర్మ  సూచించాడు. అండర్ 19 వరల్డ్ కప్ ఎలాగైనా నెగ్గాలి అంటూ యువ ఆటగాళ్లకు సూచించాడు హిట్మాన్  రోహిత్  శర్మ . అండర్19 టీమిండియా జట్టు ప్రియమ్ గార్గ్  నేతృత్వంలో బలం గా కనిపిస్తుందని రోహిత్ శర్మ తెలిపాడు. అయితే గత సంవత్సరం కూడా అండర్-19 టీమిండియా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి వరల్డ్ కప్ ను  గెలుచుకుందన్న  విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: