క్రికెట్‌లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా రికార్డులు కొట్టడం తరచూ చూస్తున్నాం . అయితే అరుదుగా జరిగే కొన్ని విశేషాలు మాత్రం అత్యంత ఆసక్తిని పెంచుతాయి.  ఒకే తరహా గణాంకాలను ఒక మ్యాచ్‌లో నమోదు చేయడం అత్యంత అరుదుగా జరిగే విషయమే. ఇద్దరు బ్యాట్స్‌మన్‌లు  ఒకే మ్యాచ్‌లో సమానమైన పరుగులు సాధించే క్రమంలో అన్నే బంతుల్ని ఎదుర్కొంటే అది అరుదైన సందర్భంగానే నిలుస్తుంది. 


మరి ఇద్దరు పేసర్లు  ఒకే మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఒకే విధంగా పరుగులు ఇవ్వడమే కాకుండా వికెట్లను కూడా సమానంగా సాధిస్తే అది అరుదైన విషయమే. ఒకే ఇన్నింగ్స్‌లో ఇలా ఇద్దరు పేసర్లు  చెరి సమంగా వికెట్లు సాధించగా పరుగులు విషయంలో కూడా అన్నే పరుగులు ఇవ్వడం తాజాగా  చోటు చేసుకుంది.ఇంగ్లండ్‌ బౌలర్లు సామ్‌ కరాన్‌-స్టువర్ట్‌ బ్రాడ్‌లు  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో భాగంగా ఈ అరుదైన జాబితాలో చేరిపోయారు.  84.3 ఓవర్లలో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీలు 284 పరుగులకు ఆలౌటయ్యారు.

 

95 డీకాక్‌ రాణించడంతో  దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు చేసింది.  తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టును ఆలౌట్‌ చేసే క‍్రమంలో సామ్‌ కరాన్‌-స‍్టువర్ట్‌ బ్రాడ్‌లు పోటీ పడ్డారు.  ప్లేయర్స్ ఇద్దరూ పోటీ పడి వికెట్లు సాధించి  దక్షిణాఫ్రికా నడ్డివిరిచారు. ఈ క్రమంలోనే సామ్‌ కరాన్‌ నాలుగు వికెట్లు సాధించి 58 పరుగులు ఇవ్వగా, 58 పరుగులే  బ్రాడ్‌ సైతం నాలుగు వికెట్లే సాధించి ఇచ్చాడు. ఇలా  ఒకే ఇన్నింగ్స్‌లో ఒక టెస్టు మ్యాచ్‌లో  ఇద్దరూ బౌలర్లు ఒకే తరహా గణాంకాలు నమోదు చేయడం 13 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 2003లో ఇంగ్లండ్‌ బౌలర్లైన జేమ్స్‌ అండర్సన్‌-హర్మిసన్‌లు.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో తలో నాలుగు వికెట్లు సాధించి 55 పరుగుల చొప్పున ఇచ్చారు. ఆ తర్వాత ఇంతకాలానికి మళ్లీ ఇంగ్లండ్‌ బౌలర్లే ఆ అరుదైన మార్కును చేరుకున్నారు. 

 

ఇప్పటివరకూ టెస్టు క్రికెట్‌లో ఇలా ఒకే తరహాలో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేయడం ఐదోసారి మాత్రమే. 1909లో తొలిసారి ఇంగ్లండ్‌ బౌలర్లు జార్జ్‌ హిస్ట్‌-కొలిన్‌ బ్లైత్‌లు ఇలా ఒకే తరహాలో బెస్ట్‌ గణాంకాలను నమోదు చేశారు. ఆసీస్‌తో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో ఇరువురూ తలో ఐదు వికెట్లు సాధించి చెరో 58 పరుగులిచ్చారు. ఈ ఒకే  తరహా అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాల జాబితాలో భారత బౌలర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: