టీమిండియాలో మిస్టర్ కూల్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ లో ధోని తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీని దక్కించుకున్నాడు. ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులను సంపాదించుకున్నాడు ధోని . తన వ్యూహాలు ప్రణాళికలతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించారు. ఇప్పటివరకు ఏ కెప్టెన్ కి సాధ్యం  కానీ రెండు ప్రపంచ కప్ ల  రికార్డును నెలకొల్పాడు మహేంద్రసింగ్ ధోని. ధోని మైదానం లో ఉన్నాడు అంటే ఎలాంటి మ్యాచ్ నైనా తన వ్యూహాలతో విజయతీరాలకు నడిపించగలడు. అంతేకాకుండా ధోనికి బెస్ట్ ఫినిషర్ గా కూడా మంచి రికార్డు ఉంది. క్లిష్టమైన పరిస్థితుల్లో అద్భుతమైన బ్యాటింగ్ చేసి జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు మహేంద్రసింగ్ ధోని. 

 

 

 

 అయితే ధోనీ జట్టుకు సారథ్యం వహిస్తున్న సమయంలో... ఎంతో మంది యువ ఆటగాళ్లను ప్రోత్సహించిన విషయం తెలిసిందే. ఎంతో మంది యువ ఆటగాళ్లను  ఎంకరేజ్ చేస్తూ జట్టులో రాణించేలా ప్రోత్సాహాన్ని అందించారు మహేంద్రసింగ్ ధోని. అందుకే యువ ఆటగాళ్లు అందరికీ మహేంద్రసింగ్ ధోని ఒక స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. ధోనీ సారథ్యంలో టీమిండియా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియాలో ఉన్న ప్రస్తుత  స్టార్ క్రికెటర్ లందరూ ధోనీ సారథ్యంలో జట్టులోకి ప్రవేశించిన వాళ్లే ... ధోని ఇచ్చిన స్ఫూర్తితో.. ధోని సూచనలతో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం టీమిండియా జట్టులో స్టార్  ప్లేయర్ గా కొనసాగుతున్నారు. ఇకపోతే ప్రముఖ కామెంటర్ సంజయ్ మంజ్రేకర్ టీమ్ ఇండియా జట్టు గురించి అప్పుడప్పుడు పలు ఆసక్తికర కామెంట్ చేస్తారని విషయం తెలిసిందే. 

 

 

 తాజాగా ఇలాంటి కామెంట్స్ చేశారు ప్రముఖ కామెంటు సంజయ్ మంజ్రేకర్. టీమిండియా డేర్ అండ్ డాషింగ్ క్యాపిటల్ కోహ్లీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆయన. 2011లో ఆసీస్ తో  టెస్టు సిరీస్లో రెండు టెస్టుల్లో విఫలమయ్యాడు విరాట్ కోహ్లీ. దీంతో విరాట్ కోహ్లీ ని  జట్టు నుంచి తప్పించలంటూ డిమాండ్స్  కూడా వచ్చాయి. కాని అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం కోహ్లీ పై నమ్మకం ఉంచి మరో ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత మ్యాచుల్లో 44, 75 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ  ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు సంజయ్ మంజ్రేకర్. అప్పుడు కోహ్లీకి మద్దతుగా తాను ట్రీట్ చేశానని గుర్తు చేసుకున్నారు ప్రముఖ కామెంటర్ సంజయ్ మధు శేఖర్.

మరింత సమాచారం తెలుసుకోండి: