ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉన్న విషయం తెలిసిందే. బ్యాటింగ్ లో  బౌలింగ్ లో అదరగొడుతు ప్రత్యర్థి  జట్టులు అన్నింటినీ చిత్తు చేస్తూ వరుస సిరీస్ లు  గెలుచుకుంటూ దూసుకుపోతుంది విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు.అయితే జట్టు  ఎంతలా రాటుదేలినది  అంటే ప్రత్యర్థి జట్లన్నీ టీమిండియా జట్టును చూసి వణికిపోఎంతలా  ప్రస్తుతం టీమిండియా జట్టు ఉంది . ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ విభాగం గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే అత్యంత పదునైన ఫేస్ దళం  ఏది అంటే ఎవరినడిగినా టీమిండియా పేరు చెబుతారు. ప్రస్తుతం టీమిండియా పేస్ దళాన్ని  చూసి ప్రపంచం మొత్తం ఔరా అంటుంది. 

 

 

 జస్ప్రిత్ బూమ్రా,  మహ్మద్ షమీ,  ఇషాంత్ శర్మ,  ఉమేష్ యాదవ్ లతో కూడిన భారత ఫాస్ట్ బౌలర్ యూనిట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాటింగ్ లైనప్ కైనా  ముచ్చమటలు  పట్టిస్తోంది. బ్యాట్ మెన్స్ ఎంత దిగ్గజ ఆటగాడు అయినప్పటికీ అలవోకగా వికెట్లు పడగొట్టి ముచ్చెమటలు పట్టిస్తోంది టీమిండియా జట్టు. పిచ్ లతో సంబంధం లేకుండా టీమిండియా పెసర్లు చెలరేగిపోతున్నారు. దీంతో టీమిండియా ఫేస్ దళాన్ని చూసి దిగ్గజ జట్లు సైతం హడలిపోయే  పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయ్ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ మార్పు ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించగానే.. ఫాస్ట్ బౌలర్లు అందరికీ క్రమక్రమంగా అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఇషాంత్ శర్మ కూడా అదే విషయాన్ని చెబుతున్నాడు. 

 

 

 ఎంఎస్ ధోని భారత క్రికెట్ కు మరవలేని   విజయాలను అందించి ఉండొచ్చు కానీ తన  సారథ్యంలో ఒకే ఒక్క విషయంలో భారత్ వెనకబడిపోయింది ఇషాంత్ శర్మ తెలిపాడు. ధోనీ సారథ్యంలో పెసర్లు ఇంత నిలకడగా ఎప్పుడు రాణించ లేదని.. అందుకు కారణం ధోని తీసుకున్న నిర్ణయాలని తెలిపారు ఇషాంత్  శర్మ. ఫాస్ట్ బౌలర్లు అందరికీ రొటేషన్ పద్ధతిలో అవకాశాలు ఇవ్వాలని ధోని నిర్ణయించుకోవడంతో..ఎవ్వరికి  కూడా తగిన అనుభవం లభించలేదని వెల్లడించారు. అప్పుడు బౌలర్ల  సంఖ్య కూడా ఎక్కువగా ఉందని అందుకే అవగాహన ఏర్పడలేదని వివరించాడు ఇషాంత్ శర్మ. 

 

 

 

 కానీ కోహ్లీ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాక పరిస్థితిలో మార్పు వచ్చిందని పేసర్లకు నిలకడగా  అవకాశాలు ఇవ్వడంతో వారు బౌలింగ్లో రాటుదేలేందుకు తగిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఇషాంత్  శర్మ చెప్పుకొచ్చాడు. ఇక ఎక్కువ మ్యాచుల్లో కలిసి ఆడుతుండటం  వల్ల ఫాస్ట్ బౌలర్ల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి ఇశాంత్ శర్మ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: