అంతర్జాతీయ  క్రికెట్ లో  అన్ని ఫార్మాట్ లలో అరంగేట్రం మ్యాచ్ ల్లో అర్ద శతకాలు చేసిన  మొదటి  బ్యాట్స్ మెన్ గా  సరికొత్త రికార్డు సృష్టించాడు  దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్  వాన్ డెర్  డుస్సేన్.  అందులో  భాగంగా గత ఏడాది జింబాబ్వే  తో  టీ 20 లో  అలాగే ఈఏడాది పాకిస్థాన్ పై వన్డే ల్లో అరంగేట్రం చేసి  హాఫ్ సెంచరీలు చేసిన   వాన్ డెర్  డుస్సేన్   తాజాగా ఇంగ్లాండ్ తో సొంత గడ్డ పై జరుగుతున్న మొదటి టెస్టు ద్వారా  టెస్టుల్లోకి ఎంట్రీ  ఇచ్చి రెండో ఇన్నింగ్స్ లో  హాఫ్ సెంచరీ చేశాడు.  తద్వారా  అన్ని ఫార్మాట్ లలో మొదటి మ్యాచ్ లోనే అర్ద శతకం సాధించిన  బ్యాట్స్ మెన్ గా ఘనత సాధించాడు.   
 
ఇక ఇంగ్లాండ్ ,సౌతాఫ్రికా ల మధ్య  జరుగుతున్న మొదటి టెస్టు  రసకందాయం లో పడింది. ఈ టెస్టు లో  మొదటి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 284పరుగులు చేయగా ఇంగ్లాండ్ 181 పరుగులకే  కుప్పకూలింది. ఆతరువాత  రెండో ఇన్నింగ్స్  లో సౌతాఫ్రికా 272పరుగులకు ఆల్ ఔటై  ఇంగ్లాండ్ ముందు 346పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం  రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన  ఇంగ్లాండ్  మూడో రోజు ఆట ముగిసే సమయానికి  ఓ వికెట్ నష్టపోయి 121పరుగులు చేసింది. ఇంగ్లాండ్  గెలవాలంటే ఇంకా  225 పరుగులు చేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: