11 ఏళ్లు గా అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియా తరుపున సేవలందించిన ఆ జట్టు  వెటరన్ బౌలర్  పీటర్ సిడిల్  నేడు  అన్ని ఫార్మాట్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.  కెరీర్ లో 67 టెస్టులు ఆడిన సిడిల్ 30.66 యావరేజ్ తో 221 వికెట్లు తీశాడు.  2008,అక్టోబర్  లో  మొహాలీ లో ఇండియా తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా  అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టిన  సిడిల్  టెస్టుల్లో మొత్తం ఎనిమిది సార్లు  5వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు  2010 లో బ్రిస్బేన్  లో  ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు లో హ్యాట్రిక్ సాదించాడు. అది కూడా అతని పుట్టిన  రోజున కావడం విశేషం. 
 
ఓవరాల్ గా  ఆస్ట్రేలియా తరుపున  టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన  13బౌలర్ గా సిడిల్ నిలిచాడు.  ఈ ఏడాది  యాషెస్  సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన  5వ మ్యాచ్  సిడిల్ కు చివరి  మ్యాచ్. టెస్టులతో  పాటు సిడిల్  ఆసీస్ తరపున 20వన్డే లు, 2 టీ 20 లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక  సిడిల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్నా దేశవాళీ క్రికెట్ లో కొనసాగనున్నాడు. అందులో భాగంగా బిగ్ బాష్ లీగ్ లో అడిలైడ్ స్టైకర్స్ తరుపున అలాగే  షఫీల్ షీల్డ్ టోర్నీ లో విక్టోరియా తరపున  తన ప్రస్థానాన్ని కొనసాగించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: