సాధారణంగా క్రికెట్ మ్యాచుల్లో ప్రత్యర్థి ఆటగాళ్లను దెబ్బ కొట్టడానికి స్లెడ్జ్‌ చేయడం బాగా ఉపయోగిస్తారు. క్రీజ్లో ఉన్న బ్యాటింగ్ ఆడుతున్న ఆటగాన్ని మానసికంగా దెబ్బ కొట్టడానికి స్లెడ్జ్‌ చేయడం లో ఆసీస్ ఆటగాళ్లు కి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఇటువంటి తరుణంలో ఇటీవల సొంత జట్టులోనే ఇంగ్లాండ్ ఆటగాళ్లు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఒకరిపై ఒకరు చూస్తుండగానే ఆడియన్స్ గ్రౌండ్లో ఉన్న సందర్భంలోనే ఒకరిపై ఒకరు మీదకి వెళ్ళిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ వైస్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌కు టీంలో అందరి కంటే చాలా దూకుడెక్కువ.

 

గతంలో అనేక సందర్భాలలో ఇలానే ప్రవర్తించి ఒక వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో బెన్‌ స్టోక్స్‌కు ఇంగ్లాండ్ టీం నుండి దాదాపు కొన్ని నెలలపాటు దూరమయ్యాడు. ఇటువంటి తరుణంలో ఇంగ్లాండ్ టీం సహచర ఆటగాడు స్టువర్ట్‌ బ్రాడ్‌తో బెన్‌ స్టోక్స్‌ మైదానంలో గొడవకు దిగాడు. అసలు ఏ కారణం చేత గొడవ ఆరంభమైందో కచ్చితంగా తెలీదు కానీ వీరిద్దరూ ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో తమ నోటికి పనిచెప్పారు. దీంతో మైదానంలో ప్రేక్షకుల మధ్య ఆందోళన వాతావరణం నెలకొంది.

 

ఇంగ్లాండ్ టీం సభ్యుల మధ్య ఏం జరుగుతుందో అర్థం కాని వాతావరణం నెలకొంది. అయితే మొత్తం బట్టి చూస్తే ఒక విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చిన నేపథ్యం ఇద్దరు ఆటగాళ్ళు తగ్గకపోవడంతో స్టోక్స్‌-బ్రాడ్‌ల మధ్య బాదం నెలకొన్నట్లు తేలింది. సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ మ్యాచుల సందర్భంలో బ్రేక్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ గొడవ వీడియో సోషల్ మీడియాలో రావడంతో వైరల్ గా మారింది. అయితే ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవుతున్న తరుణంలో తోటి ఆటగాళ్ళు జో రూట్‌, జోస్‌ బట్లర్‌లు కలగజేసుకుని ఆ గొడవను సద్దుమణిగేలా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: