వచ్చే నెలలో  వన్డే సిరీస్ కోసం  ఆస్ట్రేలియా  జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో  టీమిండియా తో ఆసీస్  మూడు వన్డే  మ్యాచ్ లు  ఆడనుంది.  అయితే ఈపర్యటనకు ముందే ఆజట్టు కు ఎదురుదెబ్బ తగిలింది.  పక్క టెముకల గాయం కారణంగా  ఆసీస్  ఫాస్ట్ బౌలర్  సీన్  అబాట్  ఈ సిరీస్ నుండి తప్పుకున్నాడు. దాంతో అతని స్థానం లో క్రికెట్ ఆస్ట్రేలియా అల్ రౌండర్ డి ఆర్సీ షార్ట్ ను ఎంపిక చేసింది. 
 
 
జనవరి 14న  ఇరు జట్ల మధ్య ముంబై లో మొదటి మ్యాచ్ జరగనుండగా రెండో వన్డే  జనవరి 17న రాజ్ కోట్ లో అలాగే 19న బెంగుళూరు లో చివరి వన్డే జరుగనుంది. ఈమ్యాచ్ లన్ని డే /నైట్ జరుగనున్నాయి. 
 
భారత జట్టు : 
 
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ , శిఖర్ ధావన్ , కేఎల్ రాహుల్, శివమ్ దూబే , రిషబ్ పంత్ , శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ,యుజ్వేంద్ర చాహల్ , బుమ్రా, నవదీప్ సైని,శార్దూల్ ఠాకూర్, మనీష్ పాండే , షమి, కేదార్ జాదవ్ 
 
 
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్ , స్టీవ్ స్మిత్ ,లబుషెన్, పీటర్ హాండ్స్ కాంబ్, అలెక్స్ క్యారీ ,స్టార్క్ , జోష్ హేజెల్ వుడ్ , ఆడమ్ జంపా , కేన్ రిచర్డ్ సన్ ,పాట్ కమ్మిన్స్ , అష్టోన్ టర్నర్ , అష్టోన్ అగార్ , డి ఆర్సీ షార్ట్ 

మరింత సమాచారం తెలుసుకోండి: