భారత్ జట్టు  బ్యాటింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకున్నాడు . గత కొంతకాలంగా హార్దిక్ పాండ్య ప్రేమలో ఉన్నట్లు ఊహాగానాలు విన్పిస్తున్నాయి . అయితే ఈ ఊహాగానాలపై ఎప్పుడు స్పందించని హార్దిక్ , నూతన సంవత్సర రోజున నటాషా స్టాన్  కోవిచ్ తో ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించాడు . ఈ మేరకు సోషల్ మీడియా వేదిక నటాషా తో కలిసి ఉన్న ఫొటోను హార్దిక్ పోస్టు చేశాడు . గత కొంతకాలంగా వెన్నుగాయం తో క్రికెట్ కు దూరంగా ఉన్న ఈ హార్డ్ హిట్టర్ , వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు .

 

 ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ల్లో ముంబాయి జట్టు కు హార్దిక్ ప్రాతినిధ్యం వహిస్తూ , తన ఫిట్ నెస్ పరీక్షించుకుంటున్నారు . 2016 అంతర్జాతీయ క్రికెట్ లో  ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ ఆనతికాలం లోనే , భారత్ జట్టు  కీలక ఆటగాడిగా ఎదిగాడు . ఒక దశ లో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్థానాన్ని హార్దిక్  భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదని క్రీడా నిపుణులు అభిప్రాయపడ్డారు . అయితే హార్దిక్ 2019 వ సంవత్సరం అంతగా కలిసొచ్చినట్లు కన్పించడం లేదు . ఎందుకంటే ఈ ఏడాది గాయాలతోపాటు , వివాదాలు అతన్ని చుట్టుముట్టాయి . దీనితో క్రికెటేతర అంశాలతోనే హార్దిక్ వార్తల్లో ఉంటూ వచ్చాడు .

 

ఈ ఏడాది ఆరంభంలో బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించిన  ఒక టీవీ షో లో పాల్గొన్న హార్దిక్ ... అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది . తన వ్యాఖ్యల ఫలితంగా రెండు వారాల పాటు క్రికెట్ కు దూరం కావాల్సి వచ్చింది . ఇక వెన్ను నొప్పి కారణంగా పలు కీలక సిరీస్ లకు దూరమయ్యాడు . ఈ ఏడాదినా క్రికెట్ లో సత్తా చాటాలని హార్దిక్ భావిస్తున్నాడు .  

మరింత సమాచారం తెలుసుకోండి: