ఇటీవల కొందరు సినిమా నటులు, అలానే మరికొందరు క్రీడాకారులు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకోవడం ఒకప్పటితో పోలిస్తే ఎక్కువయిందని చెప్పాలి. కొన్నాళ్ల క్రితం ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి అడుగుపెట్టిన యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, మెల్లగా ఆకట్టుకునే ఆట తీరుతో వీక్షకుల్లో మంచి పేరు సంపాదించడంతో పాటు, జట్టులో కూడా నిలదొక్కుకున్నాడు. ఇక ఇటీవల కొన్నాళ్లుగా ఫ్రెంచ్ నటి నటాషా ఫ్రాంకోవిచ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న పాండ్య, ఆ విషయమై మీడియా లో ప్రసారం అయిన వార్తలకు మాత్రం ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు.
 
ఇకపోతే నిన్న నూతన సంవత్సరం సందర్భంగా ఒక కాస్టలీ బోట్ లో నటాషాతో కలిసి వేడుకలు జరుపుకున్న పాండ్య, ఎట్టకేలకు ఆమెను ప్రేమిస్తున్నానని, ఆ బోట్ లోనే ఆమె చేతికి నిశ్చితార్ధపు ఉంగరాన్ని తొడిగి ముద్దాడాడు. అంతేకాక తామిద్దరం అతి త్వరలోనే ఎంతో ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా తెలిపాడు. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహి అనే సినిమా ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన నటాషా, ఇటీవల హిందీలో ప్రసారం అయిన బిగ్ బాస్ 8 లో కూడా పోటీ చేసి మంచి క్రేజ్ సంపాందించింది. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన నటాషా, పలు టివి షోల్లోనూ,
 
సినిమాల్లోనూ నటించి మంచి పేరు గడించింది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తున్న నటాషాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక హార్దిక్, నటాషా నిశ్చితార్ధం పై ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, మణి డీప్ సింగ్ సహా మరికొందరు ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు కూడా అతడికి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలిపారు. 'మై తేరా, తు మేరీ జాన్, సారా హిందుస్థాన్', 01.01.2020 ఐ యామ్ ఎంగేజ్డ్ అంటూ హార్దిక్ పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Forever yes 🥰💍❤️ @hardikpandya93

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

మరింత సమాచారం తెలుసుకోండి: