ప్రపంచ క్రికెట్లో కొంతమంది దిగ్గజాలు సృష్టించిన రికార్డులను బద్దలు కొట్టడం ఎవరి తరము కాదు. ఎంత మంది స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ కొంతమంది సృష్టించిన రికార్డులు మాత్రం పదిలంగానే ఉంటాయి. స్టార్ క్రికెటర్ లు  కూడా ఆ రికార్డుకు చేరువలో కి వెళ్ళలేరూ . అలాంటి రికార్డే   ఇక్కడ దిగ్గజ క్రికెటర్ సృష్టించాడు. టెస్టుల్లో 400 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు దిగ్గజ క్రికెటర్. ఇక పదిహేనేళ్ల క్రితం సాధించిన రికార్డును ఇప్పుడు వరకు ఏ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేదు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు అనుకుంటున్నారా... బ్రియాన్ లారా. క్రికెట్ ప్రపంచంలోనే ఓ సమోన్నత  శిఖరం బ్రియాన్ లారా. వెస్ట్ ఇండీస్ దీవులని నుంచి వచ్చిన ఈ కళాత్మక బాట్మాన్ నేటి తరం  క్రికెటర్లకు ఓ పాఠం లాంటివాడు. 

 

 

 బ్రియాన్ లారా పదిహేనేళ్ల క్రితం ఇంగ్లాండ్ పై  ఓ టెస్టులో ఒకే ఇన్నింగ్స్లో నాలుగు వందల పరుగులు నమోదు చేశాడు. పదిహేనేళ్ళ క్రితం బ్రియాన్ లారా టెస్టుల్లో సాధించిన పరుగుల రికార్డును ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు వస్తున్నా పోతున్నా లారా రికార్డును బద్దలు కొట్టే మొనగాడు మాత్రం ఇప్పటివరకు రాలేదు అని చెప్పాలి. దీనిపై తాజాగా బ్రియాన్ లారా  స్పందించాడు. ఒకవేళ తన 400 పరుగుల రికార్డును చెరిపేసిన సరికొత్త రికార్డు నెలకొల్పడం ఎవరికైనా సాధ్యం అవుతుంది అంటే వాళ్ళు డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీరోహిత్ శర్మ వల్లే అవుతుందని బ్రియాన్ లారా వెల్లడించారు. ఓపెనర్ గా వచ్చే వార్నర్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడడానికి అవకాశం ఉంటుందని అందుకే ఇది సాధ్యమైన పనే అని లారా అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

 

 

 అంతేకాకుండా విరాట్ కోహ్లీ గ్రీస్లో నిలదొక్కుకుంటే అతడిని ఆపడం ఎంతో కష్టమని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక రోహిత్ శర్మ గురించి చెబుతూ తనదైన రోజు  రోహిత్ శర్మ ఏమైనా చేయగలడు అంటూ తెలిపాడు. స్టీవ్ స్మిత్ కూడా మంచి బ్యాట్స్మెన్ అని అయినప్పటికీ అతడు నాలుగో స్థానంలో రావడం వల్ల సుధీర్గ ఇన్నింగ్స్ ఆడడానికి కొంచెం కష్టతరమైన విషయం అంటూ లారా అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా అటు ఐసీసీ టోర్నీలో విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమ్ ఇండియా జట్టు దూసుకుపోతుందని లారా కితాబిచ్చాడు. ఇకపోతే మొన్నటికి మొన్న వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 22 ఏళ్ల నుంచి ఎవరికీ సాధ్యం కాని రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఓపెనర్గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా 22 ఏళ్ళ రికార్డులు బద్దలు కొట్టి తన పేరును లిఖించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: