అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంఎస్‌ ధోని... ఎలా అడుగుపెట్టాడో అందరికీ తెలిసిన విషయమే. టికెట్‌ కలెక్టర్‌గా  స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం సంపాదించి తర్వాత దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తాచాటుకుని భారత జట్టులోకి  ప్రవేశించాడు. ధోని ఆ తర్వాత  తన అంతర్జాతీయ కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు.  టీమిండియా మేనేజ్‌మెంట్‌ తలుపులు తట్టేందుకు మరో టికెట్‌ కలెక్టర్‌ కూడా సిద్ధంగా ఉన్నాడు.  

 

అతనే ఢిల్లీకి చెందిన హిమాన్షు సంగ్వాన్‌ రంజీల్లో రైల్వేస్‌ తరఫున ఆడుతున్న ఈ ఫాస్ట్‌ బౌలర్‌ తన బౌలింగ్‌తో అద్భుతాలు చేస్తున్నాడు. మొత్తంగా  ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లు సాధించి సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ మాత్రమే తీసిన సంగ్వాన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు  సాధించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తన బౌలింగ్‌తో పటిష్టమైన ముంబైను బెంబేలెత్తించిన సంగ్వాన్‌.. పృథ్వీషా, అజింక్యా రహానే వంటి స్టార్‌ ఆటగాళ్ల వికెట్లను కూడా ఖాతాలో వేసుకుని ఇది తన పేస్‌ అంటూ టీమిండియా సెలక్టర్లకు సవాల్‌ విసురుతున్నాడు.


అయితే  మెక్‌గ్రాత్‌  తన బౌలింగ్‌ పదునుకు  కారణం అంటున్నాడు సంగ్వాన్‌.  నేను  మెక్‌గ్రాత్‌ పర్యవేక్షణలో శిక్షణ పొందా. ఎన్నో బంతుల్ని అతని పర్యవేక్షణలోనే  వేశా. నా బౌలింగ్‌లో ఆ క‍్రమంలోనే  తప్పిదాలను సరిచేసుకున్నా.బౌలింగ్‌ను  ప్రత్యేకంగా నోట్స్‌ రాసుకుంటూ  మెరుగుపరుచుకున్నా. నాకు మెక్‌గ్రాత్‌ ప్రతీ సెషన్‌లోనూ  అండగా నిలిచాడు. చాలా టెక్నికల్‌ విషయాలు మెక్‌గ్రాత్‌ నుంచే నేర్చుకున్నా. బేసిక్స్‌తో పాటు ఓపికగా ఎలా బౌలింగ్‌ చేయాలి అనేది మెక్‌గ్రాత్‌ సార్‌ చెప్పారు. నాకు మెక్‌గ్రాత్‌ సార్‌  ఈ రెండు విషయాల్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలని  చెప్పారు. అతని మార్గదర్శకత్వమే నన్ను రాటు దేలేలా చేసింది. నా బౌలింగ్‌ క్రెడిట్‌ అంతా మెక్‌గ్రాత్‌ సార్‌కే చెందుతుంది’ అని సాంగ్వాన్‌ చెప్పుకొచ్చాడు.

 

ఇక  సాంగ్వాన్‌ ఈ సందర్బంగా పృథ్వీషా, రహానేలను ఎలా కట్టడి చేశాననే దానిపై కూడా స్పష్టం చేశాడు. ‘ ఒక ఎటాకింగ్‌ ప్లేయర్‌  పృథ్వీ షా . షా దృష్టి  ఎప్పుడూ దూకుడుగా ఆడటంపైనే పెడతాడు.  కొన్ని ఏరియాల్లో ప్రత్యేకంగా పృథ్వీ షా బంతుల్లు సంధించా. నా పేస్‌ను చేంజ్‌ చేస్తూ అతని బౌలింగ్‌ చేశా. అది ఫలించింది.  ఒక ప్రణాళికతోనే రహానే విషయంలో కూడా బరిలోకి దిగా.  రహానే వరల్డ్‌లో అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్‌లలో ఒకడు.రహానే  భారత టెస్టు క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ కూడా కచ్చితమైన ఏరియాల్లో బంతులు వేయడమే కాకుండా అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌పై ఆడేలా బంతులు వేశా. దాంతో రహానే వికెట్‌ కూడా దక్కింది. 24 ఏళ్ల  సాంగ్వాన్‌ ఇద్దరికీ ప్రణాళికలు సిద్ధం చేసుకునే పోరుకు సిద్ధమయ్యా’ అని  అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: