మూడు  మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా  గువహాటి వేదికగా  ఆదివారం శ్రీలంక-భారత్ ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఈ  టీ20 ద్వారా టీమిండియా  స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్  రికార్డు బద్దలు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.  అంతర్జాతీయ టీ 20ల్లో అశ్విన్  ఇప్పటివరకు  52వికెట్లు తీసి  అత్యధిక వికెట్లు  తీసిన భారత  బౌలర్ గా నెంబర్ 1 స్థానంలో వున్నాడు.  అయితే  టీ 20ల్లో అశ్విన్ తోపాటు మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్  కూడా అన్నే వికెట్లు  తీసి  అతని సరసన  నిలువగా  ఫాస్ట్ బౌలర్  జస్ప్రీత్ బుమ్రా 51 వికెట్లతో   తరువాతి స్థానంలో వున్నాడు. 
 
ఇక  ఆదివారం జరుగనున్న మొదటి టీ 20 లో  బుమ్రా , చాహల్  లు తుది జట్టులో చోటు దక్కించుకోనుండడంతో   అశ్విన్ రికార్డు  బద్దలు అవ్వడం పక్కా.  మరి ఈ మ్యాచ్ ద్వారా  బుమ్రా ,చాహల్ లలో  టీ 20ల్లో భారత్ తరుపున  ఎవరు అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా  రికార్డు సృష్టిస్తారో చూడాలి. ఇదిలాఉంటే ఇప్పటివరకు  భారత్ , శ్రీలంక  16సార్లు టీ 20ల్లో తలపడగా టీమిండియా 11 సార్లు , 5సార్లు లంకేయులు  విజయం సాధించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: