ఇంగ్లాండ్ సీనియర్ పేసర్  జేమ్స్ ఆండర్సన్ 37 ఏళ్ళ వయసు లో కూడా అదరగొడుతున్నాడు.   ఇంగ్లాండ్ , సౌతాఫ్రికా ల మధ్య  జరుగుతున్న రెండో టెస్టు లో మొదటి ఇన్నింగ్స్ లో  5వికెట్లు  తీసి ఆండర్సన్  సరికొత్త రికార్డు సృష్టించాడు.  టెస్టుల్లో  ఇలా 5వికెట్లు  తీయడం  ఆండర్సన్ కు ఇది 28వ సారి.  తద్వారా  ఇంగ్లాండ్ తరుపున   టెస్టుల్లో  ఎక్కువ సార్లు 5వికెట్లు తీసిన మొదటి బౌలర్ గా ఘనత సాధించాడు. 
 
ఇంతకుముందు టెస్టుల్లో  ఇంగ్లాండ్ మాజీ  బౌలర్లు ఇయాన్  బోథమ్  27సార్లు  5వికెట్లు పడగొట్టగా  సిడ్నీ బార్న్స్  24సార్లు  5వికెట్లు తీసి  ఈఫీట్ ను సాధించారు.  ఇక రెండో టెస్టులో ఆండర్సన్ దెబ్బకు మొదటి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 223 పరుగులకే  ఆల్ అవుట్ అయ్యింది.  కాగా మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 269పరుగులు మాత్రమే చేయడం తో ఆజట్టుకు స్వల్ప ఆధిక్యం లభించింది.  ప్రస్తుతం  రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లాండ్  ఓ వికెట్ కోల్పోయి 65పరుగులు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: