క్రికెట్ లో మ్యాచ్ ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతుందో చెప్పలేం. అప్పటి వరకూ ఒడిపోతారని అనుకున్న టీమ్ ఒక్కసారిగా గెలవచ్చు. అలాగే గెలుస్తుందేమో అనుకున్న టీమ్ సడెన్ గా ఓటమి పాలవ్వచ్చు. క్రికెట్ లో ఇలాంటివి చాలా సహజం. ఇలాంటివి చూసినప్పుడు ప్రేక్షకుడు ఒకరకమైన ఉద్వేగానికి లోనవుతాడు. అయితే పొట్టి క్రికెట్ లో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. పొట్టి క్రికెట్ లో ఏ టీమ్ ని అయినా తక్కువగా అంచనా వేయలేం.

 

 

ర్యాంక్ పరంగా అట్టడుగున ఉన్న టీమ్ సైతం నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న టీమ్ పై గెలవచ్చు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ముఖ్యంగా పొట్టి క్రికెట్ లో ఇలాంటి అద్భుతాలు సిక్సర్లు, ఫోర్లు బాదడం వల్లే జరుగుతాయి. ప్రేక్షకులు కూడా ఎప్పుడు సిక్సర్ వెళ్తుందా..ఎప్పుడు ఫోర్ వెళ్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. బంతి బౌండరీ దాటగానే అప్పటి వరకు నీరసంగా కుర్చీలో కూర్చున్న ప్రేక్షకుడు సైతం లేచి మరీ చప్పట్లు కొడతాడు.

 

అయితే ఒక ఓవర్లో ప్రేక్షకుడిని అలా లేచి నిలబెట్టాలంటే ప్రతీ బంతి బౌండరీ బాదాలి. ఆ బౌండరీ సిక్సర్ అయితే ఎలా ఉంటుంది... భారత ఆటగాళ్లయిన రవిశాస్త్రి, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా ఇలా ప్రేక్షకులని కుర్చీలో మళ్ళీ కూర్చోకుండా ఉత్తేజాన్ని కలిగించారు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదారు. ఈ ముగ్గురితో పాటు హార్ష్ లో గిబ్స్ కూడా ఉన్నాడు. ఇప్పుడు మరో ఆటగాడు ఈ లిస్ట్ లో చేరిపోయాడు.

 


న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ లియో కార్టర్‌ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టి అరుదైన జాబితాలో స్థానం సంపాదించాడు. న్యూజిలాండ్‌ సూపర్‌ స్మాష్‌ టీ20 లీగ్‌లో భాగంగా కాంటర్‌బరీ-నార్తరన్‌ నైట్స్‌ల మధ్య ఆదివారం మ్యాచ్‌ జరిగింది.ఈ మ్యాచ్‌లో కాంటర్‌బరీ బ్యాట్స్‌మన్‌ అయిన లీయో కార్టర్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: